Advertisement
Google Ads BL

అమెజాన్ ప్రైమ్ లో కోతలరాయుడు


త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న హీరో శ్రీకాంత్ సినిమా కోతలరాయుడు

Advertisement
CJ Advs

ఏ యస్.కె. ఫిలిమ్స్ బ్యానర్ లో హీరో శ్రీకాంత్, కృష్ణాష్టమి ఫేం డింపుల్ చోపడే, జై సింహ ఫేం నటషా దోషి హీరోయిన్స్ గా పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, బిత్తిరి సత్తి, సుడిగాలి సుధీర్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. సుధీర్ రాజు దర్శకత్వం వహించారు. ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం కోతల రాయుడు. ఫిబ్రవరి 4న థియేటర్స్ లలో విడుదలై ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.అయితే ఈ సినిమా ఇప్పడు అమెజాన్ ప్రైమ్ లో త్వరలో విడుదల కాబోతోంది ఈ సందర్భంగా 

చిత్ర నిర్మాతలు ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్ లు మాట్లాడుతూ.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ నెల 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింపబడడమే కాక మాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. మంచి సినిమా ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారని మా కోతలరాయుడు సినిమా ద్వారా మరోసారి నిరూపించారు.మా చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.కామెడీ, ఫైట్స్ బాగున్నాయి.శ్రీకాంత్ నటన చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. అయితే కరోనా కారణంగా థియేటర్స్ కు వచ్చి చూడని వారికొరకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయ బోతున్నాము. అందరూ మా సినిమాను చూసి ఆదరించి ఆశీర్వదించాలని మనవి చేసుకొనుచున్నాము అన్నారు. 

చిత్ర దర్శకుడు సుధీర్ రాజు మాట్లాడుతూ.. శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా దోషి, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ వంటి సీనియర్ నటులతో ఇంత మంచి కథకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఫ్యామిలీలో ఉన్న అందరూ కలిసి చూడదగ్గ అంశాలు ఉన్నాయని, శ్రీకాంత్ పాత్ర అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని అన్నారు.. 

నటీనటులు: శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా దోషి, పోసాని కృష్ణ మురళి,మురళీ శర్మ, బిత్తిరి సత్తి, సుడిగాలి సుధీర్, సత్యం రాజేష్, పృద్వి, చంద్రమోహన్, సుధ, హేమ, శ్రీ లక్ష్మీ, జయవాణి, తదితరులు. 

సాంకేతిక నిపుణులు: కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ రాజు, సంగీతం: సునీల్ కశ్యప్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సురేష్ వర్మ, కో.డైరెక్టర్: హారనాధ్ రెడ్డి, నిర్మాతలు: ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్.

Kothala Rayudu will be streaming on Amazon Prime soon:

Hero Srikanth is a movie Kothala Rayudu who will be streaming on Amazon Prime soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs