Advertisement
Google Ads BL

పవన్‌కు సోదరుడిలా వచ్చా: కేటీఆర్‌


భీమ్లా నాయక్ ఈవెంట్: కేటీఆర్ మాట్లాడుతూ.. మంచి మనిషి, మంచి మనసున్న మనిషి, విలక్షణమైన శైలి. నాకు తెలిసి సూపర్‌ స్టార్లు, సినిమా స్టార్లు చాలా మంది ఉంటారు కానీ.. కల్ట్‌ ఫాలోయింగ్‌ ఉండే నటుడు పవన్‌ కల్యాణ్‌. ఈరోజు ఇక్కడికి ప్రభుత్వ ప్రతినిధిగా రాలేదు. పవన్‌ కల్యాణ్‌గారి సోదరుడిగా వచ్చా. మేమంతా ఆయన తొలిప్రేమ సినిమా చూసిన వాళ్లమే. అప్పటి నుంచీ ఇప్పటి వరకు ఒకేలా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం అసాధారణమైన విజయం. అందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. 8 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ భారత చలన చిత్ర పరిశ్రమకు ఒక సుస్థిరమైన కేంద్రంగా హైదరాబాద్‌ని రూపొందించాలనే సంకల్పంతో ఉన్నాం. కేసీఆర్‌గారి నాయకత్వంలో పురోగమిస్తున్న క్రమంలో మాకేౖతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది.

Advertisement
CJ Advs

కల్యాణ్‌గారి లాంటి పెద్దలందరూ అండగా ఉంటే.. తప్పకుండా హైదరాబాద్‌ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కేంద్రంగా మారుతుందనే విశ్వాసం ఉంది. ఈ రోజు సీఎం కేసీఆర్‌ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అతి ముఖ్యమైన మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌కి ప్రారంభోత్సవం చేశారు. ఈరోజు గోదారమ్మకి కూడా దారి చూపెట్టిన కేసీఆర్‌గారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. మీరు షూటింగ్స్‌ గోదావరి జిల్లాలలోనే కాదు తెలంగాణలో కూడా ఇప్పుడు కాళేశ్వరం పుణ్యమా అని చెప్పి మల్లన్న, కొండపోచమ్మ సాగర్‌లో కూడా చేయవచ్చు అని  కల్యాణ్‌గారిని కోరుతున్నా. ప్రపంచంలోని అతి పెద్దదైన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ని ఇక్కడ మూడున్నర సంవత్సరాలలోనే పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌గారిది. ఇక్కడ మీరు షూటింగ్స్‌ చేసి, తెలంగాణ ప్రాంతానికి మరింత ప్రాచుర్యం తీసుకొస్తారని చిత్ర పరిశ్రమను కోరుతున్నాను. భీమ్లా నాయక్‌ చిత్రం ద్వారా చాలా మంది అజ్ఞాత సూర్యులను బయటికి తీసుకువచ్చినందుకు పవన్‌ కల్యాణ్‌ గారికి, చిత్రయూనిట్‌కి అభినందనలు అని అన్నారు.

KTR speech at Bheemla Nayak event:

Bheemla Nayak pre release event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs