Advertisement
Google Ads BL

సమంత - యశోద కోసం స్టార్ హోటల్‌


రూ. 3 కోట్ల భారీ సెట్స్‌లో సమంత - శ్రీదేవి మూవీస్ యశోద సినిమా కోసం కళా దర్శకుడు అశోక్ నేతృత్వంలో రూ. 3 కోట్ల రూపాయల వ్యయంతో సెట్స్ వేశారు. ప్రస్తుతం ఆ సెట్స్‌లో కథలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 

Advertisement
CJ Advs

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. సమంత ప్రధాన తారగా మేం నిర్మిస్తున్న యశోద సినిమాలో 30 నుంచి 40 శాతం సన్నివేశాలు ఓ ప్రాంతంలో జరుగుతాయి. అందుకోసం హైదరాబాద్‌లో చాలా స్టార్ హోటల్స్ చూశాం. అయితే.. 35, 40 రోజులు హోటల్స్‌లో చిత్రీకరణ చేయడం అంత సులభం కాదు. అందుకని, సీనియర్ కళా దర్శకుడు అశోక్ నేతృత్వంలో సెట్స్ రూపొందించాం. నాన‌క్‌రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోలో రెండు ఫ్లోర్స్ తీసుకుని వేసిన ఈ సెట్స్ కోసం సుమారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. డైనింగ్ హాల్, లివింగ్ రూమ్, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ.. సెవెన్ స్టార్ హోటల్‌లో ఉండే సౌకర్యాలను తలపించేలా ఏడెనిమిది సెట్స్ వేశాం. ఫిబ్రవరి 3న మొదలైన షెడ్యూల్ అక్కడే జరుగుతోంది. సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ తదితర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. పతాక సన్నివేశాలు కొడైకెనాల్‌లో ప్లాన్ చేశాం. జనవరిలో సంక్రాంతికి ముందు ఒక షెడ్యూల్, డిసెంబర్ 6 నుంచి క్రిస్మస్ వరకూ తొలి షెడ్యూల్ చేశాం. ఏప్రిల్ నెలాఖరుకు చిత్రీకరణ అంతా పూర్తి చేయాలనుకుంటున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తాం అని చెప్పారు.

ఒక్కడు లో ఛార్మినార్ సెట్ వేసినది అశోకే. ఆయన ఇంకా పలు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన సెట్స్ వేశారు. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 150కు పైగా సినిమాలు చేశారు. కథకు తగ్గట్టు ఈ సినిమా కోసం ఆయన అద్భుతమైన సెట్స్ వేశారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

Samantha’s much awaited Yashoda movie:

 Sridevi Movies unveils a Magnificent sets for Samantha's Yashoda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs