అఖండ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను ఏ హీరో ని చూస్ చేసుకుంటారో అని మాస్ ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆయన నెక్స్ట్ మూవీ పై అందరిలో ఆసక్తి పెరిగిపోతుంది.. బోయపాటి శ్రీను అతి త్వరలో BS10 ని పట్టాలు ఎక్కించడానికి రెడీ అయ్యారు. అది ఇస్మార్ట్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని తో బోయపాటి సినిమా చేయనున్నారు. అది కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా ఫిలిం గా బోయపాటి - రామ్ కాంబో RAPO20 మూవీ ఉండబోతుంది. ప్రస్తుతం రామ్‌తో ది వారియర్ ను నిర్మిస్తున్న ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్‌లో నిర్మించనున్నారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.ఇప్పటికి కుదిరింది. అదీ మా హీరో రామ్ తో ది వారియర్ తర్వాత సినిమాగా కుదరడం కూడా హ్యాపీగా ఉంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తాం.ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం. మా బ్యానర్‌కు ఇది ప్రెస్టీజియస్ మూవీ. ప్రస్తుతం రామ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ది వారియర్ ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లుగా బోయపాటి - రామ్ మూవీ కూడా ఐదు భషాల్లో భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లుగా నిర్మాత తెలిపారు.