పాత్రికేయుల సమావేశంలో నిర్మాత యం. రాజశేఖర్ మాట్లాడుతూ– నేను చెప్పిన ఈ సినిమా కథను నమ్మి నాతో ట్రావెల్ చేయటానికి ముందుకొచ్చిన ముగ్గురుకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. కథ వినగానే ప్రకాశ్‌రాజు గారు, ఏ.ఎల్ విజయ్ గారు, నవీన్‌చంద్ర మనం సినిమా కలిసి చేస్తున్నాం అని నన్ను నమ్మి ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు అన్నారు.
నవీన్‌చంద్ర మాట్లాడుతూ– ఈ సినిమా కథ చాలా స్పెషల్. ఎంతోమంది ఈ కథతో నిజ జీవితంలో ఇన్‌స్ఫైర్ అవుతారు. ఇలాంటి మంచి కథతో నా దగ్గరికి వచ్చిన దర్శకుడు వాలీకి థ్యాంక్స్. చక్కని కథలను తెరకెక్కించే నిర్మాత రాజశేఖర్ అన్న నాకు ఎప్పటినుండో మంచి మిత్రుడు. ఎంతోమంది సినిమా పెద్దలు వచ్చి మా సినిమాను బ్లెస్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్ అన్నారు.
కార్తీక్ రత్నం మాట్లాడుతూ– దర్శకుడు వాలీ కథను ఎంతో కొత్తగా రాసుకున్నారు. నిర్మాత రాజశేఖర్ గారు తెలుగులో నేను నటించిన కేరాఫ్ కెంచెరపాలెం సినిమాను తమిళ్‌లో కేరాఫ్ కాదల్ తెరకెక్కించి నన్ను తమిళ్‌కి కూడా పరిచయం చేశారు. ఈ సినిమాతో ఆయన పెద్ద విజయం సాదిస్తారుఅన్నారు. విజయ్ మాట్లాడుతూ కంటెంట్ ఉన్న ఏ సినిమా అయినా నాకు చాలా ఇష్టం. అలాంటి కథతో రాజశేఖర్ నా దగ్గరికి వచ్చారు. కథ నచ్చటంతో పెద్ద సినిమా అవుతుంది అనే నమ్మకంతో ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యాను అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత బి.నర్సింగరావు, నటుడు రాజారవీంధ్ర, దర్శకుడు శ్రీపురం కిరణ్, గుణ 369 ఫేమ్ డైరెక్టర్ అర్జున్ జంధ్యాల, దర్శకులు గౌతమ్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. వాణీబోజన్, అమృతా అయ్యర్‌లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా–గురుదేవ్, ఎడిటర్– సతీష్ , ఆర్ట్– హరిబాబు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్– రంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివమల్లాల