Advertisement
Google Ads BL

అం అః మూవీ టీం రక్తదానం


చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నందు అం అః మూవీ టీం వందమంది రక్తదానం 

Advertisement
CJ Advs

రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిఫరెంట్ టైటిల్, నేటితరం ఆడియన్స్ కోరుకునే థ్రిల్లింగ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అం అః మూవీ. మునుపెన్నడూ చూడని డిఫరెంట్ కథకు తెరరూపమిస్తూ డైరెక్టర్ శ్యామ్ మండ‌ల ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ అం అః చిత్రానికి ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ట్యాగ్‌లైన్‌ పెట్టారు. 

ఈ చిత్రానికి సందీప్ కుమార్ కంగుల‌ సంగీతం అందిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నందు అం అః మూవీ టీం వందమంది రక్తదానం చేసారు. 

ఈ సందర్భంగా హీరో సుధాకర్ జంగం మాట్లాడుతూ.. నేను అం అః మూవీలో నటించాను. నాకు సినిమాలు రావడానికి బలమైన కారణం చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన చేసే డాన్సులు, ఫైట్స్, మ్యానరిజం నన్ను బాగా ఆకర్షించాయి. అవే నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి బలమైన పునాది వేశాయి. కాబట్టి నేను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నందు అం అః మూవీ టీం వందమందితో కలిసి రక్తదానం చెయ్యాలని నిర్ణయించాను. మా ఊరి నుండి అభిమానులతో కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించాను. ఇక్కడి వచ్చి రక్తదానం చేసిన టీం మెంబెర్స్ కి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.

నిర్మాత జోరిగె శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. నేను చిరంజీవి వీరాభిమానిని. హీరో సుధాకర్ ఈ విషయం చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఇలా నిర్వహించడం సాధ్యమవుతుందా అని అనుకున్నాను. కానీ హీరో సుధాకర్ పట్టుదలతో ఇది సాధించాడు. ఈ సందర్భంగా టీం సభ్యులందరికి నా అభినందనలు.

దర్శకుడు శ్యామ్ మండల మట్లాడుతూ.. నేను కూడా చిరంజీవి అభిమానిని అవడం, ఆయన రక్తదానం ద్వారా ప్రాణదానం చెయ్యడం నాకు ఎంతో స్ఫూర్తి నిచ్చింది. ఈ కార్యక్రమానికి హీరో సుధాకర్ కి అన్ని విధాలా సాయం చేస్తూ ఈ రక్తదాన శిబిరానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి నా వంతు కృషి చేశాను. 

నటీన‌టులు: సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య‌, రామరాజు, రవిప్రకాష్, రాజశ్రీ నాయర్, దువ్వాసి మోహన్, శుభోదయం సుబ్బారావు, తాటికొండ మహేంద్ర నాథ్, గని, ఉన్నికృష్ణన్, మునీశ్వరరావు త‌దిత‌రులు

ద‌ర్శ‌కుడు: శ్యామ్ మండ‌ల‌, నిర్మాత‌: జోరిగె శ్రీనివాస్ రావు, బ్యాన‌ర్స్‌: రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్, కో ప్రొడ్యూస‌ర్‌: అవినాష్ ఎ.జ‌గ్త‌ప్‌, లైన్ ప్రొడ్యూస‌ర్‌: ప‌ళ‌ని స్వామి, సినిమాటోగ్రాఫ‌ర్‌: శివా రెడ్డి సావ‌నం, మ్యూజిక్‌: సందీప్ కుమార్ కంగుల‌, ఎడిటర్: జె.పి, కథ : నవీన్ ఎరగాని, రైటర్స్ : కిరణ్ కుమార్ చప్రం, అజ్జు మహంకాళి, పిఆర్ఓ: సాయి సతీశ్, పర్వతనేని రాంబాబు.

Am Aha Team blood donate at Chiranjeevi Blood Bank:

Hundreds of people donate blood at Am Aha Team at Chiranjeevi Blood Bank
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs