Advertisement
Google Ads BL

FIR లాంటి చిత్రం నాకు చేయాలనుంది-రవితేజ


కోలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ఎఫ్ఐఆర్. ఈ  చిత్రానికి  మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌గ‌ర్వ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. 

Advertisement
CJ Advs

రవితేజ మాట్లాడుతూ.. ఆరు నెలల క్రితం ఈ సినిమాను చూశాను. నాకు చాలా నచ్చింది. డిఫరెంట్ కంటెంట్ సినిమా. ఇలాంటి చిత్రం నాకు కూడా చేయాలని ఉంది. విష్ణు విశాల్‌కు ఆల్ ది బెస్ట్ అని అన్నారు.

గుత్తా జ్వాలా మాట్లాడుతూ.. ఈ సినిమాకు విష్ణు, టీం అంతా కూడా చాలా కష్టపడ్డారు. చాలా మంచి సినిమా. అందరూ థియేటర్లో చూడండి. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని నేను అన్నాను. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను కచ్చితంగా చూడాలి అని అన్నాను. రవితేజ మమ్మల్ని సపోర్ట్ చేశారు. ఆయనకు థ్యాంక్స్ అని అన్నారు.

గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. మను ఆనంద్ నాకు పదేళ్లుగా తెలుసు. విష్ణు విశాల్ ఈ సినిమాలో నటించడమే కాదు నిర్మించారు. రవితేజ గారు తెలుగులో ప్రజెంట్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు తెలుగులో డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమా అందరినీ మెప్పిస్తుంది. విష్ణు విశాల్ మొదటి నుంచి డిఫరెంట్ సినిమాలను చేస్తూనే వచ్చారు. చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లోకి రాబోతోంది అని అన్నారు.

FIR pre release event:

Vishnu Vishal FIR pre release event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs