కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ కి కేవలం తమిళ్ లోనే కాదు అన్నిచోట్లా గొప్ప గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. తండ్రిలాగే తను కూడా తమిళ సీమకే పరిమితం కాకుండా ఇతర భాషల వారికీ చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది శంకర్ డాటర్ అదితి శంకర్. అయితే దర్శకురాలిగా కాదండోయ్... నటిగా, గాయనిగా.!
ఇటీవలే తను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ కానున్న తమిళ్ ఫిల్మ్ విరుమాన్ మొదలైంది. అందులో కార్తీ సరసన కథానాయికగా కనిపించనుంది అదితి. అలాగే తాజాగా మరో మలయాళం సినిమా కూడా ఓకే చేసిందట ఈ మల్టీ టాలెంటెడ్ గర్ల్. మల్టీ టాలెంటెడ్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. మేకప్ వేసుకుని నటించడమే కాదు మైక్ పట్టుకుని పాటలు కూడా పాడగలను అంటూ సింగర్ అవతారం ఎత్తింది అదితి. అదీ మన తెలుగు సినిమా కోసం.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తోన్న గని సినిమాలో రోమియో జూలియట్ అనే సాంగుని సింగేసింది అదితి. సదరు పాటని ఫిబ్రవరి 8 న విజయవాడ K L యూనివర్సిటీలో గ్రాండ్ గా లాంఛ్ చెయ్యనున్నారు. సూపర్ ఫామ్ లో ఉన్న ఎస్ ఎస్ థమన్ ఎక్సట్రార్డినరీగా చేసిన ట్యూనుకి అదితి వాయిస్ అద్భుతంగా కుదిరిందని అంటున్నారు. సింగర్ గా ఎంట్రీ ఓకే... మరి హీరోయిన్ గాను ఓ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ చేసేస్తే అదితి అభినయాన్ని మనమూ చూడొచ్చు. ఆఫ్ కోర్స్... తన ప్రతి సినిమాని తెలుగుకి తెచ్చే కార్తీ ఇపుడు అదితి శంకర్ తో చేస్తోన్న విరుమాన్ ని కూడా డబ్ చేసి వదులుతాడు అనుకోండి. కానీ మన హీరో సరసన మనదైన తెలుగు సినిమా నేరుగా చేస్తే ఆ కిక్కే వేరు. మనకైనా... తనకైనా.!