Advertisement
Google Ads BL

ఫిబ్రవరి 11 న వస్తోన్న బ్యాచ్ ( పార్ట్ 1 )


బాహుబలి, రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథం, మళ్ళీరావా వంటి చిత్రాలలో బాలనటుడిగా మెప్పించిన సాత్విక్ వర్మ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం బ్యాచ్. బేబీ ఆరాధ్య సమర్పణలో ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకంపై సాత్విక్ వర్మ, నేహా పటాన్ జంటగా నటిస్తున్నారు.రఘు కుంచే సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 11న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు.ఇది రెండు పార్టులుగా విడుదల చేస్తున్నారు.

Advertisement
CJ Advs

దర్శకుడు శివ మాట్లాడుతూ.. యూత్ ని టార్గెట్ చేసి తీసిన చిత్రమిది బెట్టింగ్, మేల్ ప్రాస్ట్యూషన్ నేపథ్యంతో సాగే కథ ఇది. రఘు కుంచే అందించిన సంగీతం ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. ఇప్పటికే  విడుదలైన పాటలు మీలియన్ వ్యూస్ తో ప్రేక్షకులను చేరాయి.ఈ నెల 11న విడుదలవుతున్న మా బ్యాచ్ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

నిర్మాత రమేష్ గనమజ్జి మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మా సినిమా బిజినెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది.ఇందులో నటించిన సీనియర్ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా నటించారు.వారంతా మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 11న వస్తున్న మా బ్యాచ్ సినిమా 100% హిట్టవుతుందనే నమ్మకం గట్టిగా ఉంది. ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నాను అన్నారు.

నటీనటులు: బాహుబలి ప్రభాకర్, వినోద్ కుమార్, చిన్నా, మిర్చి మాధవి, సంధ్యాజనక్, మేకా రామకృష్ణ, డి.ఎస్ రావు, చాందిని బతీజ్, వినోద్ నాయక్ తదితరులు

సాంకేతిక నిపుణు; నిర్మాత: రమేష్ గనమజ్జి, సహ నిర్మాతలు: సత్తిబాబు కసిరెడ్డి, అప్పారావు పంచాది, దర్శకత్వం: శివ, సంగీతం: రఘు కుంచే, డి ఓ పి: వెంకట్ మన్నం, ఎడిటర్: జెపి, ఆర్ట్స్: సుమిత్ పటేల్, డాన్స్: రాజ్ పైడి, ఫైట్స్: నందు, పి.ఆర్.ఓ: హర్ష.

Batch Movie Grand Release on Feb 11th:

Batch Movie<span>&nbsp;Part 1 Based On Male Prostitution&nbsp;</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs