Advertisement
Google Ads BL

లూజర్ 2 కు రాజమౌళి ప్రశంసలు


రాజమౌళి ప్రశంసలు అందుకున్న జీ 5 ఒరిజినల్ సిరీస్ లూజర్ 2 నటుడు శశాంక్

Advertisement
CJ Advs

ప్రముఖ ఓటీటీ వేదిక జీ 5లో విడుదలైన ఒరిజినల్ సిరీస్ లూజర్ చూశారా? ఆ సిరీస్‌ను అంత త్వ‌ర‌గా వీక్షకులు మర్చిపోలేరు. టైటిల్ లూజర్ కావచ్చు. కానీ, రిజల్ట్ విషయంలో విన్నరే. వీక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేసిన సిరీస్ అది. జీ 5 లోనే ఇప్పుడు ఆ సిరీస్‌కు సీక్వెల్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే! లూజర్ 2ను ఇటీవల ప్రముఖ దర్శకులు రాజమౌళి చూశారు. ప్రశంసించారు. విలక్షణ కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, కొత్త సినిమాలు.. అన్ని వర్గాల ప్రజలకు వినోదం అందిస్తున్న ఏకైక ఓటీటీ వేదిక జీ 5. జీ 5.. ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి! ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో మనసులను తాకే కథలను చెప్పడానికి ప్రయత్నిస్తుంది. స్పోర్ట్స్ డ్రామా జాన‌ర్‌లో రూపొందిన ఒరిజినల్ సిరీస్ లూజర్ తో వీక్షకుల మనసులు గెలుచుకుంది. ఇప్పుడు లూజర్ 2తో మరోసారి సినీ ప్రముఖుల, ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.

ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, ప్రధాన పాత్రల్లో నటించిన జీ 5 ఒరిజినల్ సిరీస్ లూజర్ 2. హిట్ సిరీస్ లూజర్ కు సీక్వెల్ ఇది. తొలి సీజన్ తెరకెక్కించిన అభిలాష్ రెడ్డి.. శ్రవణ్ మాదాలతో కలిసి రెండో సీజన్ తెరకెక్కించారు. జీ5, అన్న‌పూర్ణ స్టూడియోస్‌, స్పెక్ట్ర‌మ్ మీడియా నెట్‌వ‌ర్క్క్‌ నిర్మించాయి. జనవరి 21నుంచి సి సిరీస్ జీ 5 లో స్ట్రీమింగ్ అవుతోంది. లూజర్ లో నటించిన న‌టించిన శ‌శాంక్‌తో క‌లిసి రాజమౌళి సెకండ్ సీజ‌న్‌ను చూశారు. సిరీస్‌తో పాటు శశాంక్ న‌ట‌న‌ను ప్ర‌శంసించారు. ఈ విషయాన్ని శశాంక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లూజర్ 2 చూడటంతో పాటు నా నటనను ప్రశంసించినందుకు థాంక్యూ. ఓల్డ్ విల్సన్ మేనరిజమ్స్ మీకు నచ్చడం సంతోషంగా ఉంది. మీకు సిరీస్ కూడా నచ్చడం ఇంకా ఇంకా సంతోషంగా ఉంది. ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోవద్దని జాన్‌ను విల్స‌న్ మోటివేట్ చేసే సీన్ రాజమౌళి గారికి ఫెవరెట్ సీన్. అది స్ఫూర్తివంతంగా ఉందని చెప్పారు అని శశాంక్ ట్వీట్ చేశారు. 

సూరి పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి, మాయ‌గా ధ‌న్యా బాలకృష్ణ‌న్‌, రూబీ పాత్ర‌లో క‌ల్పికా గణేష్, ఆమె తండ్రి ఇర్ఫాన్‌గా షాయాజీ షిండే, విల్స‌న్ పాత్ర‌లో శ‌శాంక్‌, జాన్‌గా హ‌ర్షిత్ రెడ్డి, గోవ‌ర్ధ‌న్ పాత్ర‌లో సూర్య‌, ప‌ల్ల‌విగా పావ‌నీ గంగిరెడ్డి, రుక్ష‌ణ‌గా స‌త్య కృష్ణ‌న్ న‌టించిన లూజ‌ర్ 2 ఒరిజిన‌ల్ సిరీస్‌కు రచన: సాయి భరద్వాజ్, శ్రవ‌ణ్ మాదాల‌, అభిలాష్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైన్: ఝాన్సీ, క్రియేటివ్ ప్రొడ్యూసర్: మహేశ్వర్ రెడ్డి గోజల, కాస్ట్యూమ్ డిజైనర్ & స్టైలిస్ట్: రజనీ, కూర్పు: కుమార్ పి. అనిల్‌, ఛాయాగ్ర‌ణం: న‌రేష్ రామ‌దురై, సంగీతం: సాయి శ్రీ‌రామ్ మ‌ద్దూరి, ద‌ర్శ‌క‌త్వం:

ZEE5 Original Loser 2 receives applause from SS Rajamouli:

Actor Sashank is elated about the celebrated filmmaker's endorsement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs