Advertisement
Google Ads BL

సాయిరామ్ ఒక పథకం ప్రకారం ఫస్ట్ లుక్‌


కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న టాప్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ మరోసారి.. హీరోగా సత్తా చాటడానికి రెడీ అయ్యారు. జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ దర్శకత్వంలో వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఒక పథకం ప్రకారం సినిమాతో మరోసారి సాయి రామ్ శంకర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Advertisement
CJ Advs

సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా ఒక పథకం ప్రకారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా వస్తుంది. ఇందులో రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నారు సాయిరామ్ శంకర్. తాజాగా ఈ చిత్ర పోస్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. సినిమా కాన్సెప్టును పోస్టర్‌లోనే చూపించారు మేకర్స్. ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు సాయిరామ్ శంకర్. పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే ఒక పథకం ప్రకారం వస్తుంది. ఈ చిత్రం కోసం ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ వర్క్ చేస్తున్నారు. దర్శకుడు వినోద్ విజయన్, ఎడిటిర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ డిజైనర్ సహా మరో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు ఒక పథకం ప్రకారం సినిమా కోసం పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరికొన్ని విశేషాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

Sai Raam Shankar Oka Pathakam Prakaaram first look revealed :

Sai Raam Shankar Makeover For Oka Pathakam Prakaaram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs