Advertisement
Google Ads BL

వి.ఆర్.జి.ఆర్ మూవీస్ కి వినాయక్ క్లాప్


వి.ఆర్ .జి .ఆర్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్: 1 చిత్రంగా సీనియర్ ,నూతన నటీనటుల తో ఫిల్మీ గ్యాంగ్ స్టర్స్ దర్శకత్వంలో ఒక హారర్ సినిమా ,.... ప్రొడక్షన్ నెం: 2 చిత్రంగా యాక్టింగ్ గురు  "మహేష్ గంగిమళ్ల" ని దర్శకుడిగా పరిచయం చేస్తూ  గొంగటి వీరాంజనేయ నాయుడు నిర్మిస్తున్న "యూజ్ ఫుల్ ఫెలోస్"  చిత్రాల పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి . ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్, ఐ.ఏ.యస్., ఐ.పి.యస్  ఆఫీసర్స్ ,టి. చిరంజీవులు, వై. గంగాధర్ , యం. జగన్నాధం, టి.విక్రమ్,, జె.ప్రభాకర్ రావు, లతో పాటు వినయ్ కుమార్ లు మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.పూజ కార్యక్రమాలు అనంతరం ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ రెండు చిత్రాల హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ కొట్టారు,ఆడిషనల్ సెక్రెటరీ కాళీ కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ టి.చిరంజీవులు గౌరవ దర్శకత్వం వహించారు.ఈ పూజా కార్యక్రమాలు అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో 

Advertisement
CJ Advs

ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ మాట్లాడుతూ.. ఒకే సారి రెండు చిత్రాలు నిర్మిస్తూ ఇద్దరి దర్శకులకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. జి.వి. నాయుడు నిర్మిస్తున్న ఈ రెండు చిత్రాలు గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత జి.వి. నాయుడు మాట్లాడుతూ..నన్ను, మా బ్యానర్ ను బ్లెస్ చేయడానికి వచ్చిన ఐ.ఏ.యస్., ఐ.పి.యస్  ఆఫీసర్లకు ధన్యవాదాలు.నాకు సినిమా అంటే ఏంతో ఇష్టం ఉండడంతో దర్శకులు మహేష్ గంగిమళ్ల , మరియు ఫిల్మీ గ్యాంగస్టర్స్ టీం చెప్పిన కథలు నచ్చడంతో  మా వి.ఆర్.జి.ర్ మూవీస్ పతాకంపై హారర్ కథాంశంతో ఒక సినిమా, యూత్ ఫుల్ సబ్జెక్ట్ లతో ఒక సినిమాని... నూతన దర్శకులతో ఒకే సారి రెండు సినిమాలు నిర్మిస్తూ   చాలా మంది కొత్త ఆర్టిస్టులను, టెక్నిషియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో నటీనటుల వివరాలు తెలియజేస్తాము.మంచి కాన్సెప్ట్ తో నిర్మిస్తున్నామని  అన్నారు.

యూజ్ ఫుల్ ఫెలోస్ చిత్ర దర్శకుడు మహేష్ గంగిమళ్ల మాట్లాడుతూ.... నేను చెప్పిన కథ నచ్చడంతో నాకిలాంటి మంచి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాత జి.వి. నాయుడుగారికి ధన్యవాదాలు. ప్రతి మనిషి మారాలి అనుకుంటాడు కానీ అది కస్టమైన పని. కానీ కొన్ని సార్లు పరిస్థితులే వారిని మారుస్తాయి.అలా అప్పటి వరకు యూజ్ లెస్ ఫెలోస్ గా ఉన్న వారు పరిస్థితులు వల్ల యూజ్ ఫుల్ ఫెలోస్  గా ఎలా మారారు అనేదే ఈ చిత్ర కథాంశం అన్నారు.

Click Here Photos: VRGR Movies Opening 

ప్రొడక్షన్ నెం: 1 చిత్ర 

మాటల రచయిత మాధవ్ కోదాడ మాట్లాడుతూ..ఈ సినిమాకు నేను కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాను.ఒకే సారి రెండు చిత్రాలు నిర్మిస్తున్న జి.వి.  నాయుడు గారు పెద్ద నిర్మాత అవ్వాలని అన్నారు.

హీరోయిన్ మిహిర మాట్లాడుతూ.. నటనకు మంచి స్కోప్ వుండే ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు. 

సాంకేతిక నిపుణులు 

ప్రొడ్యూసర్ :గొంగటి వీరాంజనేయ నాయుడు(జి.వి .నాయుడు) 

ప్రొడక్షన్ నెం:1 డైరెక్షన్ : ఫిల్మీ గ్యాంగ్ స్టర్స్.. కథ- స్క్రీన్ ప్లే - మాటలు : మాధవ్  కోదాడ, ఫోటోగ్రఫీ : జయపాల్ నిమ్మల, సంగీతం : రాజేష్💐  ప్రొడక్షన్ నెం:2 చిత్రం పేరు : యూజ్ ఫుల్ ఫెలోస్ , రచన : దర్శకత్వం : మహేష్ గంగిమళ్ల, ఫోటోగ్రఫీ : జయపాల్ నిమ్మల, PRO : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

Click Here Video: VRGR Movies Opening 

VRGR Movies Production No.1 Movie Opening:

VRGR Movies launch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs