Advertisement
Google Ads BL

మారుతి హ్యాండ్ మీదగా డైమండ్ రాణి సాంగ్


ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి విడుద‌ల‌చేసిన‌ కొత్త కొత్త‌గా చిత్రం నుంచి డైమండ్ రాణి సాంగ్ కు మంచి స్పంద‌న‌

Advertisement
CJ Advs

అజయ్‌, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, ఆనంద్ (సీనియర్ హీరో), తులసి, కాశీవిశ్వనాద్, కల్యాణి నటరాజన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న చిత్రం కొత్త కొత్త‌గా. బి జి గోవిందరాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్నారు యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి హనుమాన్ వాసంశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలోని డైమండ్ రాణి.. సాంగ్ ను శుక్ర‌వారం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతీ ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. శేఖర్ చంద్ర సంగీతం దర్శకత్వంలో కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి పాడిన డైమండ్ రాణి.. సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల చేసిన కొద్ది సేప‌టికే మంచి స్పంద‌న రావ‌డం విశేషం.

మంచి ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవ‌లే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి విడుద‌ల చేశారు. అలాగే టీజ‌ర్ కూడా మంచి ఆద‌ర‌ణ పొందుతోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుగుతున్నాయి. ఈ సినిమాను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

న‌టీన‌టులు- అజయ్, వీర్తి వఘాని, ఆనంద్ (సీనియర్ హీరో), కాశీ విశ్వనాధ్, తులసి, కల్యాణి నటరాజన్, పవన్ తేజ్, ఈరోజుల్లో సాయి త‌దిత‌రులు.

బ్యానర్: ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్, స‌మ‌ర్ప‌కులు: బి జి గోవింద రాజు, నిర్మాత: మురళీధర్ రెడ్డి ముక్కర, దర్శకుడు: హనుమాన్ వాసంశెట్టి, సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, కెమెరా- వెంకట్, కొరియోగ్రాఫర్: హరికిరణ్, ఫైట్ మాస్టర్: పృధ్వీ శేఖర్, ఆర్ట్ డైరెక్టర్: సురేష్ భీమగాని, సాహిత్యం: కాసర్ల శ్యామ్, అనంత శ్రీరామ్, కృష్ణ చైతన్య, శ్రీ మణి.

A good response to the Diamond Rani song from Kottha Kotthaga:

Kottha Kotthaga teaser was also a good reception
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs