Advertisement
Google Ads BL

రామ్ అసుర్ కు అమెజాన్‌లో అద్భుతమైన రెస్పాన్స్


అమెజాన్‌లో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటున్న రామ్ అసుర్ మూవీ

Advertisement
CJ Advs

కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. అది థియేటర్ అయినా, ఓటీటీ వేదిక అయినా ప్రేక్షకుల కన్ను కచ్చితంగా పడుతుంది. అలాంటి లిస్టులోనే చేరిపోయింది  వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో అభినవ్ సర్దార్, రామ్ కార్తిక్ నటించిన రామ్ అసుర్ మూవీ. రీసెంట్‌గా థియేటర్స్‌లో విడుదలై సత్తా చాటిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ఓటీటీ వేదిక అమెజాన్‌లో రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. చిత్రానికి వస్తున్న ఈ రెస్పాన్ చూసి దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

డైమండ్ నేపథ్యంలో పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ ప్రతిభను వెలికితీసింది. సినిమా చూస్తున్నంత సేపు సగటు ప్రేక్షకుడు థ్రిల్లింగ్‌గా ఫీల్ అయ్యేలా ఈ విలక్షణ కథాంశాన్ని ప్రేక్షకుల ముందుంచారు. కలికాలంలో మంచి- చెడు అనే కాన్సెప్ట్ తీసుకొని ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే సన్నివేశాలతో ఎంతో ఆసక్తికరంగా మలిచిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ అసెట్ అయింది. ఇకపోతే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటున్న అభినవ్ సర్దార్ రామ్ అసుర్ సినిమాతో మరో మెట్టు ఎక్కారు. సూరి పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. చిత్రంలో లుక్ పరంగా అట్రాక్ట్ చేసిన ఆయన టాలీవుడ్ యష్‌గా ప్రేక్షకుల నోళ్ళలో నానిపోయారు.  

ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ  సంయుక్తంగా నిర్మించారు. అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్ హీరోలుగా నటించగా చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శెర్రి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. శాని సాల్మాన్‌‌ ముఖ్యపాత్రలో నటించి తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ రామ్ అసూర్ సినిమాకు థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ ఒకెత్తయితే, ఓటీటీలో కూడా అదే రేంజ్ ఆదరణ లభిస్తుండటం అనేది ఇలాంటి విలక్షణ కథలు మరిన్ని తెరకెక్కించేలా చిత్రయూనిట్‌కి మంచి బూస్టింగ్ ఇస్తోంది.

Ram Asur Gets Wonderful Response On Amazon Prime:

Ram Asur Movie Successfully Running OTT
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs