Advertisement
Google Ads BL

నన్ను యాక్సెప్ట్ చేసినందుకు థాంక్స్‌ -ఆశిష్


మా ఆశిష్‌ను ఆశీర్వ‌దించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా చాలా థాంక్స్ : రౌడీ బాయ్స్ సక్సెస్ ప్రెస్ మీట్‌లో నిర్మాత దిల్ రాజు

Advertisement
CJ Advs

ఆశిష్ (నిర్మాత శిరీష్ త‌న‌యుడు) హీరోగా శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం రౌడీ బాయ్స్. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌లైన సినిమాను దిల్ రాజు ప్రేక్ష‌కుల‌తో క‌లిసి ప్ర‌త్యేకంగా వీక్షించారు. 

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. రౌడీ బాయ్స్ సినిమాను యూత్‌ఫుల్ కంటెంట్‌తో తెర‌కెక్కించామ‌ని ముందు నుంచి చెబుతూ వ‌చ్చాను. ఇప్పుడు రౌడీ బాయ్స్ సంధ్య థియేట‌ర్‌లో, ప్ర‌సాద్ ఐ మ్యాక్స్‌లో చూశాను. ప్ర‌తి సీన్‌ను ఆడియెన్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో సాంగ్స్ వ‌చ్చే సీన్‌లో ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా మ్యూజికల్‌గానీ, డాన్సుల ప‌రంగా కానీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. సినిమా 2 గంట‌ల 25 నిమిషాల‌ను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తూ వ‌చ్చారు. సినిమాను చూసిన వారంద‌రూ బావుంద‌ని అంటున్నారు. ఓ న్యూ హీరో సినిమాను బావుంద‌ని అన‌డం చాలా ఆనందంగా ఉంది. మా ఎసీవీసీ బ్యాన‌ర్ ద్వారా హీరోగా ప‌రిచ‌యం అయిన ఆశిష్‌ను ఆశీర్వ‌దించి యాక్సెప్ట్ చేసినందుకు అంద‌రికీ చాలా చాలా థాంక్స్. అన్నీ ఏరియాల నుంచి సినిమా బావుంద‌ని అప్రిషియేష‌న్ రావ‌డం ఇంకా సంతోషాన్ని ఇస్తుంది. యూత్ స‌హా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు న‌చ్చే సినిమా. యూత్‌, ఫ్యామిలీ, మాస్ ఆడియెన్స్ ఎంజాయ్ చేసే సినిమా రౌడీ బాయ్స్ అన్నారు. 

ద‌ర్శ‌కుడు శ్రీహ‌ర్ష కొనుగంటి మాట్లాడుతూ.. ఇది చాలా ఎమోష‌న‌ల్ మూమెంట్‌. నా తొలి సినిమా హుషారు వ‌చ్చి మూడేళ్లు అవుతుంది. ఈ సినిమాను స్టార్ట్ చేసేట‌ప్పుడు ఇంత పెద్ద‌గా అనుకోలేదు. కానీ పెద్ద పెద్ద టెక్నీషియ‌న్స యాడ్ కావ‌డంతో సినిమా విజువ‌ల్‌గా బ్యూటీఫుల్‌గా వ‌చ్చింది. ముందు రాజుగారికే థాంక్స్ చెప్పాలి. ఇన్నేళ్ల క‌ష్టానికి ఇప్పుడు రిలీఫ్ దొరికిన‌ట్లు అయ్యింది. మా టీమ్ అంద‌రికీ ఇది ఎమోష‌న‌ల్ మూమెంట్‌. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ అయితే, ప్రీమియ‌ర్ చూసి ఏడ్చేసింది. బాగా తీశాన‌ని అంటున్నారు. ఆశిష్ తొలి సినిమా హీరోలా అనిపించ‌లేద‌ని అంటున్నారు. అంద‌రికీ థాంక్స్‌ అన్నారు. 

హీరో ఆశిష్ మాట్లాడుతూ.. హీరోగా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకుల‌కు థాంక్స్‌. మీరు ఏదైతే న‌మ్మ‌కంతో నేను బాగా చేశాన‌ని అన్నారో. దాని కోసం ఇంకా మంచి సినిమాలు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష‌కు థాంక్స్‌. అనుప‌మ టెరిఫిక్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఇంత మంచి స‌పోర్ట్ అందించిన అనుప‌మ‌కు థాంక్స్‌. ప్రేక్ష‌కుల‌కు, సపోర్ట్ చేసిన వారికి లైఫ్ లాంగ్ రుణ‌ప‌డి ఉంటాం. ఈ సంక్రాంతి కూడా రాజుగారికి హిట్ ఇచ్చినందుకు థాంక్స్‌. దేవిశ్రీ అన్న‌.. అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. మ‌దిగారు ప్ర‌తి షాట్‌లో ఎంతో అద్భుతంగా చూపించారు. ఎంటైర్ రౌడీ బాయ్స్ టీమ్ థాంక్స్‌ అన్నారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో కోమాలి స‌హా చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

Rowdy Boys Success Meet‌:

Many thanks to the Telugu audience for blessing Ashish
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs