సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతులమీదుగా విడుదలైన మై నేమ్ ఈజ్ శృతి ఫస్ట్ లుక్ & టీజర్
Click Here:👉 My Name is Shruti Movie teaser Launch Photos
ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా గురించి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని చేస్తున్న సస్పెన్స్ ఏంక్వైరీ థ్రిల్లర్ మై నేమ్ ఈజ్ శృతి ప్రముఖ కథానాయిక హన్సిక ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి. డి.శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన మై నేమ్ ఈజ్ శృతి (ది హిడెన్ ట్రూత్ అనేది ఉపశీర్షిక) చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర ఫస్ట్ లుక్ & టీజర్ ను విడుదల చేశారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై తీసిన మై నేమ్ ఈజ్ శృతి టీజర్ బాగుంది. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది.ఎందుకంటే క్రైమ్ కు సంబంధించిన మెసేజ్ ఓరియెంటెడ్ వంటి మంచి కథను సెలెక్ట్ చేసుకుని ఇండస్ట్రీ కి పరిచయమవుతున్న మిత్రుడు బురుగు రమ్య ప్రభాకర్ గౌడ్, దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ లు ఈ కథను చాలెంజ్ గా తీసుకొని చేస్తున్నారు. ఈ రోజు ట్యాలెంట్ అనేది సమాజంలో పెరిగిపోయింది. కాబట్టి ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమ కు కొత్త తరం,కొత్త యంగ్ స్టర్స్ నటీనటులు, టెక్నిసిషన్స్ వంటి ట్యాలెంట్ ఉన్న ఎంతో మంది తిరుగుతున్నారు.వారంతా చిత్ర పరిశ్రమకు రావాల్సిన అవసరం ఉంది.ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో అఖండ ,పుష్ప సినిమాలు లు వచ్చి కొంత పుంజుకోవడం జరిగింది.అలాగే కొత్త సినిమాలు కూడా వస్తున్నాయి. అందుకే చిత్ర పరిశ్రమ పుంజుకోవాలని ఈ మధ్య టికెట్ రేట్స్ పెంచడం జరిగింది. చిన్న సినిమాలు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 4 షోల నుండి 5 షోలకు పెంచడం జరిగింది.అలాగే థియేటర్స్ ఇబ్బందుల విషయం కూడా మడ్లాడతానని చెప్పడం జరిగింది.ఈ రోజు తెలంగాణ ముఖ్య మంత్రి కె.సి.ఆర్ నాయకత్వంలో సినిమా ఇండస్ట్రీ దేశంలోనే ఒక హబ్ గా ఉండాలనేదే మా ఆకాంక్ష,.అలాగే లొకేషన్స్ లో పర్మిషన్ తీసుకోవటానికి సినిమా నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి దానికి సంబంధించిన సింగిల్ విండో ను కూడా ఒకే చేశాము.సినిమాకు కులం మతం, ప్రాంతం అనేది ఉండదు.సినిమా అనేది ప్రజలకు వినోదాన్నిస్తూ ఎంటర్ టైన్ చేస్తుంది.కాబట్టి సినిమా ప్రతి ఒక్కరికి అవసరం. సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన విషయాలను ప్రభుత్వం నిమిషాల మీద నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇందుకు మీడియా కూడా సహకరించాలి. ఎందుకంటే సినీ పరిశ్రమ పై లక్షలాది మంది ఆధారపడి వున్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడే అంశాలు చూపిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఈ రోజు సినిమా అనేది ఈ దేశంలో నెంబర్ వన్ స్థానంలో మన హైదరాబాద్ ఉంది.ఇంకా రాబోయే కాలంలో సినిమాకు సంబంధించిన మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తుందని తెలియజేస్తూ.. ఈ సినిమా తీసిన ప్రభాకర్ గౌడ్ కు పూర్తి స్థాయిలో నా సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఈ చిత్ర దర్శక, నిర్మాతలకు, నటీనటులకు,టెక్నిసిషన్స్ లకు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుతూ ‘మై నేమ్ ఈజ్ శృతి" చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
హీరోయిన్ హన్సిక మాట్లాడుతూ.. మా చిత్ర టీజర్ విడుదలకు వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు.2022 లో విడుదవుతున్న ఈ చిత్రం చాలా బాగుంది. అందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆన్నారు.
Click Here:👉 Hansika Motwani Photos
చిత్ర దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్.మాట్లాడుతూ.. మేము మినిస్టర్ ను కలసి టీజర్ విడుదలకు రమ్మని పిలవగానే తనను తిరుపతి వెళ్లే కార్యక్రమం వున్నా.. మా సినిమాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు. ముంబై లో ఉన్న హన్సిక అపార్ట్ మెంట్ లో 75 కోవిడ్ కేసులు వున్నా కూడా అక్కడ అందరి పర్మిషన్ తీసుకొని మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన హన్సిక కు ధన్యవాదాలు.చిన్న సినిమా తీద్దామని టిపికల్ పాయింట్ ను తీసుకుని నిర్మాతకు ఈ కథ చెప్పిన వెంటనే రిస్క్ అయినా పర్వాలేదు ఈ సినిమా చేద్దామంటూ సినిమాకు కావలసిన పెద్ద ప్యాడింగ్ ను కూడా తీసుకొని పెద్ద సినిమా చేద్దామని సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. నాకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అన్నారు.
నిర్మాత ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. ఎంతో బిజీ ఉన్నా మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన తలసాని ఆన్నగారికి ధన్యవాదాలు. హన్సిక గా వుండే ఏరియాలో కంటోన్మెంట్ జోన్ వున్నా కూడా తను రావడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది.ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొన్నది అనేది చిత్ర కథాంశంతో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు నాకు ఏ కథ చెప్పాడో అదే చాలా చక్కగా తీశాడు. నటీనటులు, టెక్నిసిషన్స్ అందరూ డెడికేటెడ్ గా ఓన్ మూవీ గా వర్క్ చేయడంతో సినిమాను త్వరగా పూర్తి చేయగలిగాము.ఈ ఆడియోను టిప్స్ ద్వారా విడుదల చేస్తున్నాము అన్నారు.
నటీనటులు: హన్సిక, మురళీశర్మ, జయప్రకాష్, ఆడుకాలం నరెన్, రాజా రవీంద్ర, సీవీఎల్ వినోదిని, సాయితేజ్ కాల్వకోట, మహేష్ తదితరులు
బ్యానర్ : వైష్ణవి ఆర్ట్స్, నిర్మాతలు : బురుగు రమ్య ప్రభాకర్, సహ నిర్మాతలు: పవన్‌కుమార్ బండి,ఎజీ ఎలియస్,నాగేందర్ రాజు, లైన్ ప్రొడ్యూసర్: కె.విజయ్‌కుమార్, రచన-దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్, కెమెరా: కిషోర్ బోయిడపు, సంగీతం: మార్క్.కె.రాబిన్, ఎడిటర్: చోట.కె.ప్రసాద్, ఆర్ట్: గోవింద్ ఇరసాని, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సుబ్బరావు గూడపాకల.