Advertisement
Google Ads BL

శేఖర్ లో శివానీ రాజ'శేఖర్'


యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా శేఖర్. ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలోనూ రాజశేఖర్ కుమార్తె పాత్రలో శివాని నటించారు.‌ వెండితెరపై తండ్రి తనయ కలిసి కనిపించనున్న తొలి చిత్రమిదే. ఈ రోజు సినిమా యూనిట్ రాజశేఖర్, శివానీ రాజశేఖర్ స్టిల్స్ విడుదల చేసింది.

Advertisement
CJ Advs

హీరోగా రాజశేఖర్ 91వ సినిమా శేఖర్. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన సినిమా ఇది.

దర్శకురాలు జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. రాజశేఖర్, శివాని మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నిజ జీవితంలో ఎలా ఉంటారో... సినిమాలో కూడా అలాగే ఉన్నారు. వారిద్దరూ చాలా సహజంగా చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ గ్లింప్స్, లవ్ గంట మోగిందంటే పాటకు అద్భుత స్పందన లభించింది. సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామం అని చెప్పారు.

రాజశేఖర్, ఆత్మీయ రజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్ , రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ పార్ట్నర్: టికెట్ ఫ్యాక్టరీ, కళ: సంపత్ - దత్, రైటర్: లక్ష్మీ భూపాల, ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: వంకాయలపాటి మురళీకృష్ణ, నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి,  శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జీవితా రాజశేఖర్.

Shivani Rajasekhar in Rajasekhar Shekar movie:

Rajasekhar 91th movie Shekar 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs