Advertisement
Google Ads BL

రౌడీ బాయ్స్ పెద్ద సక్సెస్ కావాలి -అల్లు అర్జున్‌


సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న వ‌స్తున్న రౌడీ బాయ్స్ పెద్ద సక్సెస్ కావాలి.. ఆశిష్ సహా ఎంటైర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ -ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌

Advertisement
CJ Advs

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్.. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం రౌడీ బాయ్స్.  తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నారు. సోమ‌వారం ఈ సినిమా నుంచి డేట్ నైట్.. సాంగ్‌ను విడుద‌ల చేశారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా..

డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష కొనుగంటి మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌. నా తొలి చిత్రం హుషారు సినిమాను లో బడ్జెట్‌లో చేశాం. ఆ సినిమాకు ప్ర‌మోష‌న్స్ చేసుకోవ‌డానికి ఇబ్బందులు ప‌డుతున్న స‌మ‌యంలో మా సినిమాలోని ఉండి పోరాదే.. సాంగ్‌ను అల్లు అర్జున్‌గారు త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేయ‌డంతో ఆ సాంగ్ ఎక్క‌డికో రీచ్ అయ్యింది. అలా ఆయ‌న మాకు స‌పోర్ట్ అందించారు. ఆయ‌న‌కు నేను బిగ్గెస్ట్ ఫ్యాన్‌. నేను కాలేజ్‌లో చ‌దువుకునేట‌ప్పుడు ఫ్రెష‌ర్స్ పార్టీ ఉండేది. అప్పుడు సమోసా.. కూల్ డ్రింక్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. అది బ్రేక్ చేద్దామ‌ని చెప్పి ఇలా డేట్ నైట్ సాంగ్ ప్లాన్ చేశాం. క‌చ్చితంగా పాట అందరికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను. జ‌న‌వ‌రి 14న క‌లుద్దాం అన్నారు. 

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. సాధార‌ణంగా నాకు, బ‌న్నీకి మ‌ధ్య థాంక్స్ చెప్పుకోవాడాలు ఉండ‌వు. కానీ ఇప్పుడు చెబుతున్నాను. ఎందుకంటే.. ఆర్య స‌మ‌యంలో బ‌న్నీ త‌కిదిమ‌తోం సాంగ్‌కి డాన్స్ చేస్తున్న‌ప్పుడు ఆశిష్‌కి ఏడేళ్లు. త‌ను బ‌న్నీని అలాగే చూస్తుండిపోయాడు. ఇప్పుడు త‌న పాట‌నే బ‌న్నీ రిలీజ్ చేయ‌డం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రౌడీ బాయ్స్‌ విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన పాట‌లు, ట్రైల‌ర్ బావుంద‌ని అంటున్నారు. ట్రైల‌ర్ అయితే 6 మిలియ‌న్స్ వ్యూస్ క్రాస్ అయ్యాయి. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. 15-25 సంవ‌త్స‌రాలున్న అమ్మాయిలు, అబ్బాయిలు సినిమాను విప‌రీతంగా ఎంజాయ్ చేస్తారు. ప్రేమ దేశం, తొలి ప్రేమ‌, ఆర్య‌, హ్యాపీ డేస్‌లా ఇదొక ఔట్ అండ్ ఔట్ యూత్‌ఫుల్ కంటెంట్‌తో చేసిన సినిమా ఇది. యూత్ అంద‌రూ జ‌న‌వ‌రి 14న రౌడీ బాయ్స్‌ను ఎంజాయ్ చేస్తారు. మాది గ్యారంటీ. డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష‌.. త‌న లైఫ్‌లో జ‌రిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకుని చేశాడు. సాధార‌ణంగా నా సినిమాల‌న్నీ ప‌ద్ధ‌తిగా ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేలా ఉంటాయి. కానీ ఈ సినిమా కోసం కాస్త బోర్డ‌ర్ దాటాం. ఆశిష్‌కి చాలా మంచి సినిమా ఇది. జ‌న‌వ‌రి 14న ఆశిష్ ఎలా చేశాడో ప్రేక్ష‌కులు చెప్ప‌డానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాం. సంక్రాంతికి మా బ్యానర్ నుంచి 5 సినిమాలు వ‌చ్చాయి. అన్ని స‌క్సెస్‌ఫుల్ సినిమాల‌య్యాయి. ఈ జ‌న‌వ‌రి 14న వ‌స్తున్న రౌడీ బాయ్స్‌తో డ‌బుల్ హ్యాట్రిక్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. థియేట‌ర్స్‌కు వ‌చ్చే ఆడియెన్స్ మాస్కులు వేసుకుని రండి. అంద‌రూ సేఫ్‌గా ఉండాలి.. ఎంజాయ్ చేయాలి అన్నారు. 

హీరో ఆశిష్ మాట్లాడుతూ.. మా రౌడీ బాయ్స్‌ ఫ‌స్ట్ లుక్‌ను సుకుమార్‌గారు, వినాయ‌క్‌గారి స‌మ‌క్షంలో విడుద‌ల చేశాం. అలాగే ఎన్టీఆర్‌గారు మా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇప్పుడు బ‌న్నీ అన్న సాంగ్ రిలీజ్ కోసం వ‌చ్చారు. అంద‌రికీ థాంక్స్‌. బ‌న్నీ అన్న గురించి నేను చెప్పేటంతోడ్ని కాను. కానీ నేను చూసిన విష‌యాలు చెబుతాను. ఆర్య సినిమా కోసం తకిదినతోం.. సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. మేం అంద‌రం ఎంజాయ్ చేస్తున్నాం. కానీ బ‌న్నీ అన్న‌.. డాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. అది చూసి సినిమాల్లో ఇలా డేడికేష‌న్ ఉంటేనే రావాలి. లేక‌పోతే రాకూడ‌ద‌నిపించింది. ఆర్య సినిమా కోసం బ‌న్నీగారే బెంగుళూరు వెళ్లి కాస్ట్యూమ్స్ సెల‌క్ట్ చేసుకుని బ‌స్ తీసుకుని హైద‌రాబాద్ వ‌చ్చేశారు.. అదే క‌మిట్‌మెంట్‌ను ఆయ‌న ద‌గ్గ‌ర నేను చూసి నేర్చుకుంది. డేట్ నైట్ సాంగ్ నేను డాన్స్ చేస్తుంటే వ‌రల్డ్స్ బెస్ట్ డాన్స‌ర్ వ‌చ్చి న‌న్ను జడ్జ్ చేస్తున్నారు. అలాగే పుష్ప‌, అల వైకుంఠ‌పుర‌ములో స‌క్సెస్‌లు చూసిన త‌ర్వాత‌.. మేం యాక్టింగ్ నేర్చుకున్నామా అనిపించింది. నేను ప‌క్కా AA ఫ్యాన్‌. నేను పూణెకి వెళ్లిన‌ప్పుడు బ‌న్నీ అన్న పాట వ‌స్తే.. ఆటో డ్రైవ‌ర్ అది విని అది బ‌న్నీ పాట క‌దా, అన్నారు. ఆటో డ్రైవ‌ర్ ఫోన్‌లో బ‌న్నీ అన్న డీపీ ఉంది. ఆయ‌న ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాలేదు. ఎప్పుడో ఆయ‌న పాన్ ఇడియా స్టార్‌. జ‌న‌వ‌రి 14న రౌడీ బాయ్స్‌ను చూసి సేఫ్‌గా మాస్కులు వేసుకుని చూసి ఎంజాయ్ చేయండి అన్నారు. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈ ఫంక్ష‌న్ నాకెంతో స్వీట్‌. నా జీవితంలో ఆర్య సినిమా ఎంతో ముఖ్య‌మైంది. సుకుమార్‌గారు లేక‌పోతే ఆర్య సినిమా ఎలా లేదో.. దిల్ రాజుగారు కూడా లేక‌పోతే ఆర్య సినిమా లేదు. ఆ సినిమా షూటింగ్ చేసేట‌ప్పుడు.. ఆశిష్‌, అన్షు, హ‌ర్షిత్ అంద‌రూ చిన్న పిల్ల‌లు. షూటింగ్ స‌మ‌యంలో ప‌క్క‌న కూర్చునేవాళ్లు. నేను అప్పుడు వాళ్లు ఇంత స‌క్సెస్‌ఫుల్ ప‌ర్స‌న్స్ అవుతార‌ని అనుకోలేదు. ఇప్పుడు చూసి అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ఫంక్ష‌న్‌కి రావ‌డం నేను చేస్తున్న ఫేవ‌ర్ కాదు. నా బాధ్య‌త‌. డేట్ సాంగ్ చాలా బావుంది. చూస్తుంటే ఫిబ్ర‌వ‌రి 14న రావాల్సిన సినిమాను జ‌న‌వ‌రి 14నే రిలీజ్ చేస్తున్న‌ట్లు అనిపిస్తుంది. రౌడీ బాయ్స్‌ ఎంటైర్ టీమ్‌కి అభినంద‌న‌లు. ఆశిష్ చాలా బాగా స్టెప్పులేశాడు. జ‌న‌వ‌రి 14న వస్తున్న ఈ సినిమావ‌స్తుంది. ఆల్ ది బెస్ట్‌. ఇదే సంద‌ర్భంలో కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత వ‌స్తున్న సినిమాల‌న్నీ బావున్నాయి. అఖండ‌, మా పుష్ప సినిమాలు వ‌చ్చాయి. అలాగే నానిగారి శ్యామ్ సింగ‌రాయ్ కూడా పెద్ద స‌క్సెస్ అయ్యింది. నాకు ఆ టీమ్‌కు కంగ్రాట్యులేట్  కుద‌ర‌లేదు. ఇప్ప‌డు చెబుతున్నాను. నానిగారు స‌హా టీమ్ అంద‌రూ అద్భుతంగా చేశారు. డైరెక్ట‌ర్ సినిమాను హ్యాండిల్ చేసిన తీరు బావుంది. శ్యామ్ సింగ‌రాయ్ చాలా బావుంది. సంక్రాంతికి చాలా సినిమాలు వ‌స్తున్నాయి. ఇది తెలుగు సినిమాలు గెల‌వాల్సిన స‌మ‌య‌మిది. అన్నీ సినిమాలు స‌క్సెస్ కావాలి అన్నారు. ఈ కార్యక్ర‌మంలో హ‌ర్షిత్ రెడ్డి స‌హా చిత్ర యూనిట్ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు.

Rowdy Boys movie date night song launch:

Allu Arjun to release Rowdy Boys song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs