Advertisement
Google Ads BL

తురుమ్ ఖాన్‌లు టీజర్ విడుదల


తురుమ్ ఖాన్‌లు టీజర్ విడుదల చేసిన దర్శకుడు పరుశురాం

Advertisement
CJ Advs

మాధవరావు సమర్పణలో కెకె.సినిమాస్ పతాకంపై కళ్యాణ్ రావు నిర్మిస్తున్న చిత్రం తురుమ్ ఖాన్‌లు, రూరల్ బ్యాక్ డ్రాప్ లో టామ్ అండ్ జెర్రీ లాంటి పాత్రలతో డార్క్ హ్యూమర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో 50 మందికి పైగా నూతన మరియు థియేటర్ ఆర్టిస్టులు నటించారు. శివకళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ  చిత్రం టీజర్ ని ప్రముఖ దర్శకుడు  పరశురామ్ బుజ్జి విడుదల చేశాడు. పూర్తి ఆర్గానిక్, మాస్ కామెడీగా కేవలం 21రోజుల్లో వందశాతం గింబల్ తో షూట్ చేసి, కొత్త విధానంలో తెరకెక్కిన ఈ తురుమ్ ఖాన్‌లు గురించి దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ.. లోకల్ ఇతివృత్తాలు గ్లోబల్ లో ఆవిష్కరించాలి. ఈ యంగ్ టీమ్ చేసిన ప్రయత్నం అలాగే ఉంది  ఈ చిత్రం మేకింగ్ చేసిన విధానం వింటే చాలావిచిత్రంగా అనిపించింది .. స్టాండర్డ్ మేకింగ్. నైపుణ్యం కలిగిన నటులు వీటివల్ల ఈ చిత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా, కామిక్ గా చూడాలనే ఆతృత కలిగించేలా ఉంది. టీమ్ అందరికీ శుభాకంక్షలు అన్నారు.

దర్శకుడు శివ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఈ చిత్ర ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. టీజర్ బాగుందని అందరూ అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా తురుమ్ ఖాన్‌లు ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తాము అన్నారు.

నటీనటులు: శ్రీరామ్ నిమ్మల. దేవరాజ్ పాలమూరు, అవినాష్, ఐశ్యర్య.

సాంకేతిక నిపుణులు: ఎడిటర్: నగేష్ రెడ్డి బొంతల, కెమెరామెన్: చరణ్ అంబటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, డిజైన్: దని ఏలే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: రియాన్ ముస్తఫా, నిర్మాత: కె. కళ్యాణ్ రావు, రచనా, దర్శకత్వం: శివకళ్యాణ్.

Thurum Khanlu movie teaser :

<span>Thurum Khanlu movie teaser Release by director Parushuram&nbsp;</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs