Advertisement
Google Ads BL

లవ్ యు రా లో దైవాన్నే అడగాలా లిరికల్ వీడియో సాంగ్


ఆకట్టుకుంటున్న విజయ్ ప్రకాష్ దైవాన్నే అడగాలా లిరికల్ వీడియో సాంగ్  

Advertisement
CJ Advs

సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్ పై చిన్ను క్రిష్, గీతిక రతన్ జంటగా, ప్రసాద్ ఏలూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లవ్ యు రా. సముద్రాల మంత్రయ్య బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్ సభ్యులు తాజాగా దైవాన్నే అడగాలా అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. 

విజయ్ ప్రకాష్ పాడిన ఈ పాటకు రాజా రత్నం బాట్లూరి లిరిక్స్ అందించారు. ఈశ్వర్ పెరవలి సంగీతం అందించారు. ఆకట్టుకునే ట్యూన్‌తో సాంగ్‌లో చూపించిన నాచురల్ లొకేషన్స్ హైలైట్ అయ్యాయి. ప్రేమించిన అమ్మాయి కోసం పరితపించే అబ్బాయి మనస్తత్వాన్ని ఈ పాటలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. యూత్ ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ విడుదలైన కాసేపట్లోనే భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. 

ఈ చిత్రం నుంచి అంతకుముందు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేసిన యూత్ అబ్బా మేము అనే పాటకు కూడా యూట్యూబ్‌లో విశేష స్పందన లభిస్తోంది. విలక్షణ ప్రేమ కథా చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు రవి బైపల్లి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో శేఖర్ బండి, సాయినాగ్, మధుప్రియ, దివ్య, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, జబర్దస్త్ చిట్టి బాబు, జబర్దస్త్ కట్టప్ప ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చెప్పారు దర్శకనిర్మాతలు. 

నటీనటులు: చిన్ను క్రిష్, గీతిక రతన్, శేఖర్ బండి, సాయినాగ్, మధుప్రియ, దివ్య, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, జబర్దస్త్ చిట్టి బాబు, జబర్దస్త్ కట్టప్ప.

సాంకేతిక నిపుణులు: బ్యానర్: సముద్రాల సినీ క్రియేషన్స్, కొరియోగ్రాఫర్: బ్రదర్ ఆనంద్, ఛాయాగ్రహణం: రవి బైపల్లి, మ్యూజిక్: ఈశ్వర్ పెరవలి, పాటలు: రాజారత్నం నమ్, సింగర్: విజయ్ ప్రకాష్, మేనేజర్: సుధాకర్ విశ్వనాధుని, ప్రొడ్యూసర్: సముద్రాల మంత్ర య్య బాబు, కో ప్రొడ్యూసర్స్: రవిచంద్ర సురేష్ బోయిన, చంద్రశేఖర రావ్ బండి, డైరెక్టర్: ప్రసాద్ ఏలూరి, పీఆర్‌ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

Love you raa Lyrical video song:

Love you raa movie Lyrical video song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs