Advertisement
Google Ads BL

తెలుగులో మొదటి సూపర్ గర్ల్ మూవీ ఇంద్రాణి


తెలుగులో మొట్టమొదటి సూపర్ గర్ల్ మూవీ ఇంద్రాణి

Advertisement
CJ Advs

Click Here:👉 Indrani Movie Mottion Poster

వెరోనికా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్టాన్లీ సుమన్ బాబు నిర్మాణ సారథ్యంలో తెలుగు తెరకు స్టీఫెన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న అడ్వెంచర్ మూవీ ఇంద్రాణి. తెలుగు తెరపై గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ పాయింట్ ఎంచుకొని ఈ సినిమాను రూపొందించనున్నారు. యాక్షన్ సన్నివేశాలకు తోడు కమర్షియల్ హంగులు జోడించి ఓ సూపర్ గర్ల్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

ఓ కెప్టెన్ మార్వెల్, ఓ వండర్ విమెన్ లాంటి క్యారెక్టర్‌తో రంగంలోకి దిగబోతోంది ఇంద్రాణి. వినూత్న ప్రయోగంతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. లీడ్ రోల్ పోషిస్తున్న హీరోయిన్‌కి సూపర్ పవర్ ఉంటుందట. ఆమెతో పాటు కథ అంతా ట్రావెల్ చేసే మరో ఇద్దరు హీరోయిన్లకు ఈ సినిమాలో స్కోప్ ఉందని దర్శకనిర్మాతలు చెప్పారు. ఇండియన్ సినిమా ఇప్పటిదాకా టచ్ చేయని కథను ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని అన్నారు.

ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న స్టీఫెన్.. న్యూయార్క్ ఫిలిం అకాడమీలో ట్రైనింగ్ చేసి అక్కడే రెండున్నర సంవత్సరాల పాటు స్క్రిప్ట్‌పై కసరత్తులు చేసి స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి? చాలా గ్రాండ్‌గా VFX వర్క్ ఎలా జరగాలి అనేదానిపై ఓ అంచనాకు వచ్చారు. ఆ తర్వాత ఇండియాలో మరో మూడు నెలలు రీసెర్చ్ చేసి సూపర్ అవుట్‌పుట్‌ని ఆడియన్స్ ముందు ఉంచడమే లక్ష్యంగా ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, బ్యానర్ నేమ్ రిజిస్టర్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫినిష్ చేశారు. షూటింగ్‌కి సంబంధించిన షెడ్యూల్స్‌పై ప్రణాళిక రచించి రెడీగా ఉన్నారు దర్శకనిర్మాతలు.

ఇకపోతే ఈ సినిమాలో భారీ కాస్టింగ్‌తో పాటు కొత్త నటీనటులకు ప్రోత్సాహం ఇస్తూ అవకాశం ఇవ్వబోతుండటం విశేషం. ఇది ఇండియన్ సినిమాల్లోకెల్లా డిఫరెంట్ మూవీ అవుతుందని, ఇప్పటిదాకా సూపర్ హీరోస్ చూశారు కానీ మొదటిసారి తమ సినిమాతో ఇండియన్ సూపర్ గర్ల్స్ వెండితెరపై చూపించబోతున్నామని ఆయన తెలిపారు. 

ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అబ్బురపరుస్తాయని నిర్మాత తెలిపారు. రెండున్నర సంవత్సరాల పాటు శ్రమించి స్టీపెన్ చాలా అద్భుతమైన కథను రెడీ చేశారని, ఇది అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టునేలా ఉంటుందని నిర్మాత  స్టాన్లీ సుమన్ బాబు చెప్పారు. సాయి కార్తీక్ అందించబోతున్న మ్యూజిక్ సినిమాలో హైలైట్ కానుందని చెప్పారు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామని అన్నారు. 

బ్యానర్: వెరోనికా ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత:  స్టాన్లీ సుమన్ బాబు P, డైరెక్టర్: స్టీఫెన్, ఎడిటర్: చోటా K ప్రసాద్, మ్యూజిక్: సాయి కార్తీక్, DOP: చరణ్ మాధవనేని, PRO: సాయి సతీష్, ప‌ర్వ‌త‌నేని రాంబాబు.

Indrani Movie Mottion Poster:

<span>Indrani the First Indian Super Girl Movie In Telugu</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs