Advertisement
Google Ads BL

వేయి శుభములు కలుగు నీకు ప్రి రిలీజ్ ఈవెంట్


వేయి శుభములు కలుగు నీకు ప్రి రిలీజ్ ఈవెంట్.. జనవరి 7 న గ్రాండ్ రిలీజ్ 

Advertisement
CJ Advs

జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా  మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లు గా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో  తూము నరసింహా పటేల్ మరియు జామి శ్రీనివాస రావులు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం వేయి శుభములు కలుగు నీకు.ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 7 న విడుదల వుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ వేడుక ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా దర్శకుడు వీర భద్రం చౌదరి, హీరో ఆకాష్ పూరి,,బిగ్ బాస్ విన్నర్ సన్నీ, మరియు విశ్వ, మేఘామ్స్ శ్రీహరి, తదితరులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని వహిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో

దర్శకుడు వీర భద్రం చౌదరి మాట్లాడుతూ..ఈ చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. ఫాదర్ & సన్ ల సెంటిమెంట్ అనేది ప్రతి కుటుంబం లో ఉంటుంది.కాబట్టి ఈ సినిమా ప్రతి ఫ్యామిలీ కి కనెక్ట్ అవుతుంది. మంచి కథతో RRR తేదీ రోజున ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దర్శకుడు రామ్స్ రాథోడ్ తో ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాను నిర్మిస్తున్న తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు లకు ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. టీం అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.

హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ఈ చిత్ర టీజర్, ట్రైలర్ అమేజింగ్ గా ఉంది.ఇందులో మీ అందరి హార్డ్ వర్క్ కనిపిస్తుంది. తను ఇలాగే మంచి మంచి సినిమాలు తీయాలని కోరుతున్నాను. ఈ నెల 7 న వస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాత లకు మంచి పేరు తీసుకు రావాలని కోరుతున్నాను అన్నారు.

బిగ్ బాస్ 5 విన్నర్ సన్నీ మాట్లాడుతూ.. శివాజీ రాజా గారు అందరికీ ఇష్టమైన వ్యక్తి తను నిన్ను తెరపై చూడాలి అనుకున్నాడు.కానీ మచ్ఛా.. తెరపై నీ డ్యాన్స్ అదిరింది మచ్ఛా.. దీని వెనుక ఎంత హార్డ్ వర్క్ ఉందొ తెలుస్తుంది. దర్శక, నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కుండా తీశారని ట్రైలర్, పాటలు,ఫైట్స్ చూస్తే తెలుస్తుంది

బిగ్ బాస్ విశ్వ మరియు నటుడు మేఘామ్స్ శ్రీహరి మాట్లాడుతూ.. విజయ్ రాజా డ్యాన్స్ చేస్తున్నపుడు సైడ్ నుండి చూస్తుంటే అఖిల్ లా అనిపిస్తున్నావు.తను చేస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

చిత్ర దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ.. వేయి శుభములు కలుగు నీకు. చిత్రంలో ఫాదర్ & సన్ ల మీద సాగె సెంటిమెంట్ సాంగ్ చూస్తే.. తండ్రి కొడుకు ల మధ్య ఇంత రిలేషన్ ఉంటుందా అనేలా అద్భుతంగా ఉంటుంది.ఈ సాంగ్ ను చూసిన వారంతా ఆ సాంగ్ కు కనెక్ట్ అవుతారు.వీరబద్రం గారి మేలు ఏప్పటికీ మరచిపోలేము. ఈ సినిమాకు మాకు చక్కటి హీరో దొరికాడు. మేము రమ్మన్న టైం కంటే ముందే సెట్ లో ఉండేవాడు. అంత డెడికేటెడ్ గా వర్క్ చేయడం జరిగింది. హీరోయిన్ చక్కటి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఇందులోని పాటలన్నీటికీ మంచి వ్యూస్ వచ్చాయి. టెక్నీషియన్స్,అరిస్టు లు అందరూ బాగా సపోర్ట్ చేస్తూ సహరించడం తో సినిమా చాలా బాగా వచ్చింది. నేను చెప్పిన కథను నన్ను నమ్మి నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా బడ్జెట్ కు కాంప్రమైజ్ కాకుండా తీశారు.ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. మంచి కంటెంట్ తో ఈ పండుగ వాతావరణంలో ఈ నెల 7న వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర నిర్మాతలు తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జనవరి 7 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రం వేయి శుభములు కలుగు నీకు. మంచి కంటెంట్ తో  సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి  బడ్జెట్ గురించి ఆలోచించకుండా తీశాము దీనిలో ఉన్న ఐదు సాంగ్స్ ఉంటాయి.అన్ని పాటలకు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఫుల్ యాక్షన్, థ్రిల్లర్ గా వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. థ్రిల్లర్ మూవీ. ఈ రోజుల్లో మంచి సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఒక్క సెన్సార్ కట్ లేకుండా మాకు సెన్సార్ ఇచ్చారు. మా చిత్రానికి చూసి ఆశీర్వదించాలని కోరుతున్నాం

చిత్ర హీరో విజయ్ రాజా మాట్లాడుతూ.. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు, నా మిత్రులకు, ధన్యవాదాలు. ఈ చిత్రానికి వీరభద్రం గారి సపోర్ట్ ఎంత ఉందనేది మా టీం కు మాత్రమే తెలుసు. మా చిత్ర దర్శకుడు చాలా కష్టపడి మంచి కంటెంట్ ఉన్న సినిమా తీశాడు.ఈ చిత్ర షూటింగ్ టైం లో కోవిడ్ సమస్య వున్నా కూడా నాలాంటి చిన్న హీరోకు ఇంత బడ్జెట్ అవసరమా అని చూడకుండా చిత్ర నిర్మాతలు అనుకున్న దానికంటే ఎక్కువ కర్చుపెట్టారు.ఏ హీరో హీరోకైనా ఇలాంటి నిర్మాతలే కావాలని కోరుకుంటారు. ఇంతమంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. హీరోయిన్ తమన్నా మరియు ప్రియలు చాలా బాగా చేశారు. దర్శకుడు చక్కటి కథను సెలెక్ట్ చేసుకొని మాతో మంచి చిత్రాన్ని చేశారు.జాన్ 7 న వస్తున్న మా సినిమాను అందరూ ఆధరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర హీరోయిన్ తమన్నా వ్యాస్ మాట్లాడుతూ.. ఇందులోని పాటలు నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నటి నటులు: విజయ్ రాజా, శివాజీ రాజా, తమన్నా వ్యాస్, ఢీ ఫేం ఫాల్గుణి, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, సన, అనంత్, షాయాజి షిండే, శ్రీకాంత్ అయంగార్, రోహిణి, జబర్దస్త్ అప్ప రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, కోట యశ్వంత్ తదితరులు.

సాంకేతిక నిపుణులు: బ్యానర్: జయ దుర్గ దేవి మల్టీ మీడియా, టైటిల్: వేయి శుభములు కలుగు నీకు, నిర్మాత: తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్రమ్ రమణ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్స్ రాథోడ్, కథ, మాటలు : శ్రీనాథ్ రెడ్డి, కెమెరా: కె బుజ్జి, సంగీతం: గ్యాని, ఆర్ట్ డైరెక్టర్: బి జగన్, కో డైరెక్టర్: ప్రకాష్, కాస్ట్యూమ్: ఎల్. కిశోరె కుమార్, ఎడిటర్: వినోద్, పి.ఆర్.ఓ: హర్ష.

Veyi Shubhamulu Kalugu Neeku Movie Pre-release event:

<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large tw-ta" dir="ltr"><span class="Y2IQFc" lang="en">Veyi Shubhamulu Kalugu Neeku Movie grand release on January 7th</span></pre>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs