Advertisement
Google Ads BL

శేఖర్ ఫస్ట్ సింగిల్ లవ్ గంటే మోగిందంట


యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా శేఖర్. హీరోగా ఆయన 91వ చిత్రమిది. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. బుధవారం (జనవరి 5న) ఈ సినిమా మొదటి పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.

Advertisement
CJ Advs

ఒరేయ్ నీ లవ్ స్టోరీ ఒకటి చెప్పురా అనే వాయిస్ ఓవర్ తో పాట మొదలవుతుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనూప్ రూబెన్స్ ఇచ్చిన క్యాచీ ట్యాన్ కి  చంద్రబోస్ గారి సాహిత్యంతో ప్రేమ కథని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. ఈ పాటని విజయ్ ప్రకాష్, అనూప్, రేవంత్ సంయుక్తంగా ఆలపించారు.  

లవ్ గంటే మోగిందంట అంటూ సాగే ఈ పాట యొక్క లిరికల్ వీడియోలో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో రాజశేఖర్ ఆహార్యం ఆయన గత సినిమాలకు భిన్నంగా ఉంది. మల్లికార్జున్ నరగని  కెమెరా విజువల్స్ ఫ్రెష్ ఫీల్స్ ఇస్తున్నాయి.

ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ "ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు,ఫ‌స్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి పెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ సింగల్ కూడా అదే స్థాయిలో అలరిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.

Love Gante Song Released :

Love Gante Song Released from Dr.Rajasekhar Shekar Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs