Advertisement
Google Ads BL

బిగ్ బాస్ ఫేమ్ మానస్ కు తలసాని అభినందన


బిగ్ బాస్ ఫేమ్ మానస్ ను అభినందించిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్

Advertisement
CJ Advs

దేశవ్యాప్తంగా బిగ్ బాస్ షో కి ఉన్న క్రేజ్ సంగతి అందరికి తెలిసిందే. తెలుగు లో ఈ షో కి మంచి ఆదరణ దక్కుతుంది. ఇప్పటికే ఐదు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో ద్వారా చాలా మంది ప్రతిభావంతులు మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి కాన్సెప్ట్ తో వస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని బిగ్ బాస్ షో తో నిరూపితం కాగా ఇటీవల పూర్తయిన ఐదో సీజన్ ప్రేక్షకులను మరింత రంజింప చేసిందని చెప్పాలి. మంచి మంచి గేమ్స్ తో షో ఆద్యంతం ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేసింది. ముఖ్యంగా బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్ గా వచ్చిన మానస్ తన ఆటతీరుతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని స్టార్ హోదా లో హౌస్ నుంచి బయటకు వచ్చాడని చెప్పాలి. ఆయన తన ఆటతీరుతో, ప్రవర్తన తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ ఫేమ్ తో మంచి మంచి అవకాశాలను కూడా అందుకున్నాడని చెప్పాలి. తాజాగా బిగ్ బాస్ షో లో ఆయన ప్రదర్శనకు మెచ్చి సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మానస్ ను అభినందించారు. 

ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ.. బిగ్ బాస్ షో లో మానస్ ఆట తీరు చాలా బాగుంది. ఆయన ప్రవర్తన ఎంతో హుందాగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు సంపాదించుకుంటాడు. ఆల్ ది బెస్ట్ టు మానస్ అన్నారు.

బిగ్ బాస్ ఫేమ్ మానస్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ లో నా ప్రయాణం ఇంత బాగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను హౌస్ లో ఉన్నప్పుడు నన్ను ఎంతో సహకరించి, ఇప్పుడు నన్ను ఆశీర్వదించిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

Manas game style is great -Talasani:

 Thalasani Congratulations to Bigg Boss Fame Manas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs