Advertisement
Google Ads BL

ఏవమ్ జగత్ ట్రైలర్ రిలీజ్


ఏవమ్ జగత్ ట్రైలర్ రిలీజ్.. నేటితరం నచ్చే, మెచ్చే సన్నివేశాలతో ఆసక్తికర వీడియో 

Advertisement
CJ Advs

కథలో సత్తా ఉండాలే కానీ సినిమా విజయాన్ని ఆపడం ఎవ్వరితరం కాదని ఇప్పటికే ఎన్నో చిన్న సినిమాలు రుజువు చేశాయి. చిన్న సినిమాతో పెద్ద విజయం రాబట్టడంలో సక్సెస్ అవుతున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ప్రేక్షకులు నచ్చే, మెచ్చే కథను వెండితెరపై ఆవిష్కృతం చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. సరిగ్గా అలాంటి కోవలోకి చెందిన కొత్త సినిమా ఏవమ్ జగత్. ఓ విలేజ్ కుర్రాడి ఆశ, ఆశయాలను ప్రధాన భూమికగా తీసుకొని యూత్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే వైవిద్యభరితమైన కథను ఏవమ్ జగత్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా ప్రధాన తారాగణంగా ఈ ఏవమ్ జగత్ సినిమా రూపొందిస్తున్నారు. మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి దినేష్ నర్రా దర్శకత్వం వహిస్తుండగా.. ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అతిత్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఏవమ్ జగత్ ట్రైలర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్.

2 నిమిషాల 58 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్‌లో ప్రతి సన్నివేశం కూడా ఆలోచింపజేసేలా ఉంది. పల్లెకు, పట్నానికి, యువత టాలెంట్‌కి లింక్ చేస్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్ పండించారు. ప్రతి ఫ్రేములో వచ్చే ఒక్కో డైలాగ్ యూత్ ఆడియన్స్‌‌కి బాగా కనెక్ట్ అవుతోంది. ఓ పల్లెటూరి యువకుడు చేసిన రీసెర్చ్, ఇన్నోవేషన్ థాట్‌ని చూపించిన విధానం హైలైట్ అవుతోంది. తెలివైన వాళ్లందరినీ పట్నాలకు తరిమేసే ఈ రోజు పల్లెటూళ్లన్నీ నాశనం అవుతున్నాయి అనే డైలాగ్ నేటి పరిస్థితులకు అద్దంపడుతోంది. టెక్నాలజీ గురించి తెలియజేసే సన్నివేశాలు, పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల తీరును కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఎంతో ఆసక్తికరంగా ఈ ట్రైలర్ కట్ చేశారు. ట్రైలర్ ఆధారంగా మొత్తంగా చెప్పాలంటే లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, విలేజ్ ఎఫెక్షన్, యూత్ టాలెంట్ తదితర అంశాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టమవుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.

నటీనటులు - కిరణ్ గేయ, ప్రకృతి వనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా, స్కంద అముదాల, సంజయ్, భూపేష్ వడ్లమూడి, ఫయాజ్ అహ్మద్, దినకర్, స్వప్న గొల్లం, సరస్వతి కరవాడి, విజయలక్ష్మి తదితరులు.

ఈ చిత్రానికి సంగీతం - శివ కుమార్, సినిమాటోగ్రఫీ - వెంకీ అల్ల, ఎడిటింగ్ - నిశాంత్ చిటుమోతు, ఆర్ట్ - సదా వంశి, ప్రొడక్షన్ మేనేజర్ - అభినవ్ అవునూరి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ - మోహన్ కృష్ణ, సంపూర్ణమ్మ, స్కంద ఆముదాల, క్వాలిటీ హెడ్: సిద్దార్థ కండల, నిర్మాతలు - ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్, రచన దర్శకత్వం - దినేష్ నర్రా, పిఆర్ ఓ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

Awam Jagat Trailer Release:

Awam Jagat Telugu Movie Trailer Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs