Advertisement
Google Ads BL

గ్యాంగ్‌స్టర్ గంగరాజు.. ఆసక్తి రేకెత్తిస్తున్న టీజర్


కమర్షియల్ ఎలిమెంట్స్‌తో గ్యాంగ్‌స్టర్ గంగరాజు.. ఆసక్తి రేకెత్తిస్తున్న టీజర్

Advertisement
CJ Advs

Click Here:👉 Gangster Gangaraju teaser release 

రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా విలక్షణ కథలను ఎంచుకుంటూ కమర్షియల్ జానర్ టచ్ చేస్తున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో లక్ష్.. మరికొద్ది రోజుల్లో గ్యాంగ్‌స్టర్ గంగరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. తాజాగా కొత్త సంవత్సర కానుకగా గ్యాంగ్‌స్టర్ గంగరాజు టీజర్ రిలీజ్ చేశారు.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా విడుదల చేసిన టీజర్ సినిమా పట్ల ఆసక్తి రేకెత్తించింది. అదిగదిగో మన గ్యాంగ్‌స్టర్ గంగరాజు రానే వచ్చాడు అంటూ హీరో లక్ష్ ఇంట్రో సీన్ అదిరింది. ఈ సినిమాతో విలన్‌గా పరిచయమవుతున్న స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ త‌న‌యుడు నిహార్‌ కపూర్ రోల్ సినిమాకు మేజర్ అసెట్ అవుతుందని తెలుస్తోంది. ఒక నిమిషం 9 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లో ప్రతి సన్నివేశం, విజువలైజేషన్ ఆకట్టుకుంటున్నాయి. సాయి కార్తీక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేయడంలో కీలక భూమిక పోషించింది. ఇక వీడియో చివరలో టైటిల్ దుమ్మురేపింది అని వెన్నెల కిషోర్ చెప్పడం, స్టోరీ నా దుమ్ము రేపింది అంటూ శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పడం హైలైట్ అయ్యాయి. మొత్తంగా చూస్తే లవ్, యాక్షన్, రొమాన్స్ అన్నీ కలగలిపి ఈ సినిమా రూపొందించారని స్పష్టమవుతోంది.

గతంలో ఎన్నడూచూడని ఆసక్తికర కథతో ఈ గ్యాంగ్‌స్టర్ గంగరాజు మూవీ రూపొందుతోందని, గ్యాంగ్‌స్టర్ గంగరాజు అనే క్యాచీ అండ్ క్రేజీ టైటిల్‌కి తోడు ప్రేక్షకులు థ్రిల్ అయ్యే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు చెప్పారు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు వెల్లడించారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ బాణీలు కట్టగా.. వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌, న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు.

సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం: ఇషాన్ సూర్య‌, నిర్మాత‌: చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి, బ్యాన‌ర్‌: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్, సినిమాటోగ్ర‌ఫీ: క‌ణ్ణ పి.సి, సంగీతం: సాయి కార్తీక్‌, ఎడిట‌ర్‌: అనుగోజు రేణుకా బాబు, ఫైట్స్‌: డ్రాగ‌న్ ప్ర‌కాశ్‌, కొరియోగ్రాఫ‌ర్స్‌: భాను, అనీష్‌, పి.ఆర్‌.ఓ: సాయి స‌తీశ్‌, ప‌ర్వ‌త‌నేని రాంబాబు.

Gangster Gangaraju teaser release:

Gangster Gangaraju.. Interesting teaser
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs