శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం అర్జున ఫల్గుణ. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహించారు. ఈ మూవీ డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..
డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ.. విష్ణు, వివేక్, తేజ నాకు మంచి ఫ్రెండ్స్. గోదావరి అందాలను, వాళ్ల పద్దతులను అక్కడివారు చాలా ఫ్రైడ్‌గా తీసుకుంటారు. అది ఈ ట్రైలర్‌లో కనిపిస్తుంది. శ్రీ విష్ణు ఏ కథ తీసుకుంటే అందులో లీనమై పోతారు. గోదావరి జిల్లాల్లో పుట్టి పెరిగి వచ్చిన విష్ణు గారు.. తన డైలాగ్ డెలివరీతో అదరగొట్టాడు. తెలుగు అనేది ఎంత వైవిధ్యంగా ఉంటుందో.. విష్ణు సినిమాలు కూడా అంతే వైవిధ్యంగా ఉంటాయి. నేషనల్ లెవల్‌లో రిప్రజెంట్ చేసే కెపబులిటి ఉన్న సినిమాలు ఆయన కిట్టిలో ఉండబోతున్నాయి. శ్రీ విష్ణుతో పని పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంది. తేజ జోహర్ చూశాను. ఈ సినిమాను చాలా కన్విక్షన్‌గా తీశారు. డిసెంబర్ 31 తర్వాత హ్యాపీ న్యూ ఇయర్‌తో పాటుగా, ఇరగొట్టేశారనే మెసేజ్ కూడా వస్తుంది.
సినిమాటోగ్రఫర్ జగదీష్ మాట్లాడుతూ.. నేను ముందు తేజకు థ్యాంక్స్ చెప్పాలి. మా జర్నీ జోహార్ సినిమాతో ప్రారంభమైంది. మేం మా శక్తి మేర ప్రయత్నించాం. మంచి ప్రశంసలు దక్కాయి. అర్జున ఫల్గుణ సినిమాను విజువల్ జర్నీగా చేశామని అనుకుంటున్నాం. డిసెంబర్ 31న రాబోయే ఫలితం కోసం ఎదురుచూస్తున్నాం. శ్రీ విష్ణు గారితో పని చేయడం కంఫర్టబుల్‌గా ఉంటుంది. అమృతా అయ్యర్ చక్కగా నటించింది. ఈ అద్బుతమై టీంతో కలిసి పని చేయడంఎంతో సంతోషంగా ఉంది. మా రైటర్ సుధీర్ మంచి యాక్టర్. నన్ను సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. నిర్మాతలు అన్వేష్, నిరంజన్ రెడ్డి గారికి థ్యాంక్స్.
డైలాగ్ రైటర్ సుధీర్ వర్మ మాట్లాడుతూ.. మా టీమ్‌ను బ్లెస్ చేయడానికి వచ్చిన దిల్ రాజు గారికి, యంగ్ డైరెక్టర్స్‌కు థాంక్స్. నేను ఇంతకు ముందు కొన్ని సినిమాలకు పనిచేశారు. కానీ ఫస్ట్ టైమ్ స్టేజ్ ఎక్కించింది మాత్రం అర్జున ఫల్గుణ. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు తేజ గారిని పరిచయం చేసిన ధీరజ్ గారికి థాంక్స్ చెప్పుకోవాలి. జోహర్ సినిమా చూశాక తేజ ఎంటో తెలుసు. శ్రీ విష్ణు, తేజ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు మిస్ అవ్వొద్దని కోరుకున్నాను. జోహర్ చూసి.. ఈ సినిమా చూస్తే తేజను జడ్జ్ చేయడం కష్టం. భవిష్యత్తులో ఉర మాస్ డైరెక్టర్‌గా చూడొచ్చు. మీతో ఇంకా కలిసి పనిచేయాలి. నిరంజన్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి థాంక్స్. శ్రీ విష్ణుది పక్కింటి అబ్బాయి అనే ఇమేజ్. శ్రీ విష్ణు చేసిన ప్రతి క్యారెక్టర్‌కు సఫరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇలాగే ఈ అర్జునుడు కూడా అందరికి నచ్చుతాడు. కొత్త డైరెక్టర్లకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ప్రతి సినిమాకు కొత్త డైరెక్టర్లను పరిచయం చేయాలని కోరుకుంటున్నాను.
దర్శకుడు తిరుమల కిషోర్.. విష్ణు చేసిన 15 సినిమాల్లో 10 మంది కొత్తమందే. ఉన్నది ఒకటే జిందగి చిత్రంలో డైలాగ్‌లా.. ఇండస్ట్రీలో నా ప్రతి కథలో ఉండేవాడు విష్ణు. అమృత చాలా మంచి నటి. తెలుగు తెలిసిన అమ్మాయిల ఒక్క అక్షరం కూడా మిస్ అవ్వకుండా డైలాగ్ చెబుతుంది. తేజ మాటలతోనే తాను ఎలాంటి సినిమా తీశాడో తెలిసింది. ట్రైలర్ చూశాక నా ఆలోచన నిజమని అనిపించింది. నిర్మాతలు లేకుంటే సినిమా అయ్యేది కాదు. ప్రియదర్శి మ్యూజిక్ బాగుంది.
రచయిత, దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. జోహర్ మూవీ చూసినప్పుడు తేజ అదరగొట్టాడని అనిపించింది. అర్జున ఫల్గుణ చిత్రం చాలా బాగొచ్చింది. విష్ణు క్లోజ్ సర్కిల్స్‌లో మాట్లాడేటప్పుడు ఊరి గురించి ఎక్కువగా మాట్లాడుతాడు. గోదావరి గురించి ఒక సినిమా చేయాలని విష్ణు చెప్పేవాడు. అందుకు తగ్గట్టు తేజ స్క్రిప్ట్ తీసుకువచ్చాడు. గోదావరి ఊరంటే చాలా ఇష్టం ఉన్న ఇద్దరు వ్యక్తులు తీసిన సినిమాను మీరు చూడబోతున్నారు. మీరు పండగకు ఇంటికి వెళితే రెండు రోజులు ఎక్కువ ఉండి వస్తారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. నిరంజన్, అన్వేష్‌లు సినిమా మీద ఫ్యాషన్‌తో 2008 లో మ్యాట్ని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ స్టార్ట్ చేశారు. నేను ఎలాగైతే కొత్త డైరెక్టర్లను పరిచయం చేస్తూ సినిమాలు చేస్తానో వాళ్లు కూడా సేమ్ రూట్. ఒక్క క్షణం, ఘాజీ.. ఇప్పుడు అర్జుణ ఫల్గుణ ఇలా కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నారు. నిరంజన్, అన్వేష్‌లకు ఆల్ ది బెస్ట్. మనం ఎన్ని సక్సెస్‌లు తీస్తామో తెలియదు.. కానీ ప్రయత్నం చేస్తు వెళ్తుంటే సక్సెస్ వస్తుందని నమ్ముతాను. దాన్నే వాళ్లు కూడా నమ్ముతూ ఇలాగే డిఫరెంట్ సినిమాలు తీస్తున్నారు. అర్జున మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. శ్రీ విష్ణు హీరో అనాలో, ఆర్టిస్ట్ అనాలో, యాక్టర్ అనాలో నాకు తెలియదు. కానీ లీడ్ చేస్తున్నప్పుడు హీరోనే అంటాం. ఆర్టిస్ట్‌గా ప్రతి సినిమాను కొత్తగా ప్రయత్నం చేస్తూ.. తన ఫర్ఫామెన్స్‌తో సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ, కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తున్నాడు. చేస్తు ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్‌లు వస్తాయి. ఎందరో నీ ముందు ఎగ్జామ్‌ఫుల్‌గా ఉన్నారు. ఏదో ఒక రోజు నీ ప్రయత్నం నిన్ను పెద్ద వాడిని చేస్తుంది. ప్రయత్నం ఆపకు. తేజ జోహర్ సినిమా చూశాను.. ఆల్ ది బెస్ట్. నాకు కొత్త డైరెక్టర్లు కథ చెబితే రెండు మూడు విష్ణుతో షేర్ చేశాను. బెక్కం గోపి సినిమా చేస్తున్నాడు. మా బ్యానర్‌లో కూడా సినిమా చేయబోతున్నాడు.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్ మాట్లాడుతూ.. నాకు సపోర్ట్ చేసిన తేజ గారికి, నాని గారికి, ఆదిత్య మ్యూజిక్, చైతన్య ప్రసాద్ గారికి థాంక్స్. శ్రీ విష్ణు స్క్రీన్‌పై అదరగొట్టాడు. సినిమా చాలా బాగొచ్చింది.
లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్.. తేజ, ప్రియదర్శన్‌తో నేను జోహర్ సినిమాకు పనిచేశాను. పల్లవి, చరణం పక్కన బెట్టి.. మూడ్‌ను ఎలివేట్ చేసేలా ప్రియదర్శన్ ట్యూన్ ఇస్తాడు. అన్ని పాటలు ఎంజాయ్ చేస్తూ రాశాను. అర్జున ఫల్గుణ పేరు వింటనే ఒక వైబ్రేషన్ వస్తుంది. అందరికి మంచి పేరు తీసుకొచ్చే మంచి టైటిల్.
తెలంగాణ, ఉత్తారంధ్ర, రాయలసీమ మాండలికాల్లో దేని మాధుర్యం దానిదే.. అది తెలుగు భాష గొప్పతనం. గోదావరి తల్లి రుణం తీర్చుకోవడానికి నాకు తేజ ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు.
దర్శకుడు వెంకటేశ్ మహా మాట్లాడుతూ.. ఒక వైపు ఆచార్య లాంటి మెగా ప్రాజెక్టులు చేస్తూ మరోవైపు అర్జున ఫల్గుణ వంటి సినిమాలు తీసుకొస్తున్నందకు థాంక్స్. నాలుగేళ్లుగా విష్ణుతో సినిమా చేయాలని చూశాను. కానీ కుదరలేదు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రానికి చివరి వరకు ట్రై చేశాను.. కానీ కుదరలేదు. త్వరలోనే మేము ఇద్దరం కలిసి పని చేయాలని కోరుకుంటున్నాం. జోహర్ చిత్రంలో తేజ.. సోషల్ ఇష్యూను బాగా చూపించారు. సినిమాలు అనేవి జనాలను అర్థం కావనే ప్రసక్తే ఉండదు.
రంగస్థలం మహేష్ మాట్లాడుతూ.. నాకు చాన్స్ ఇచ్చినందుకు నిర్మాతలకు, దర్శకుడు తేజ గారికి చాలా థాంక్స్. నాకు సపోర్ట్ చేసినందుకు శ్రీ విష్ణు గారికి థాంక్స్. శ్రీ విష్ణు సినిమాలోనే నేను ఫస్ట్ చేశాను. నాకు చిరంజీవి గారి తర్వాత రవితేజ గారంటే ఇష్టం. రవితేజ గరి తర్వాత శ్రీ విష్ణు అన్న అంటేనే ఇష్టం. 100 పర్సెంట్ ఉంటే ఎవరైనా 100 పర్సెంట్ ఇస్తారు. కానీ శ్రీ విష్ణు అన్న 50 పర్సెంట్ ఉన్నా.. 100 పర్సెంట్ ఇస్తాడు. అదే 100 పర్సెంట్ ఉంటే శ్రీ విష్ణు అన్న ఇరక్కొడతాడు. నాకు దర్శకుడు తేజ ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. రంగస్థలం తర్వాత నేను చేసిన ఏమోషనల్ క్యారెక్టర్ ఇది. ఆ తర్వాత అంత మంచి పాత్ర ఈ చిత్రంలో చేశాను. నేను ఎక్కువగా చెప్పానని అనుకుంటే సినిమా చూసిన తర్వాత నాకు ఫోన్ చేసి అడగొచ్చు.
దర్శకుడు సాగర్ కే చంద్ర మాట్లాడుతూ.. నన్ను ఇక్కడికి పిలిచినందుకు నిర్మాతలకు థాంక్స్. ట్రైలర్ చూసినప్పుడు చాలా ఏమోషనల్‌గా అనిపించింది. మంచి హిట్ కొట్టబోతున్నారు. అప్పట్లో ఒకడు ఉండేవాడు సినిమా రిలీజ్ అయి రేపటితో ఐదేళ్లు అవుతుంది. చాలా మంది నాకు ఫోన్ చేసి విష్ణుకు కథ చెప్పాలి అని అడుగుతున్నారు. నీతో కలిసి పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంది. విష్ణు నాకు మంచి ఫ్రెండ్.
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ - .. నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్‌లకు కంగ్రాట్స్. నేను నిన్న సినిమా చూశాను. సినిమా చాలా బాగొచ్చింది. శ్రీ విష్ణకు ఈ సినిమా మంచి హిట్ ఇస్తుంది. తేజకు కంగ్రాట్స్. మ్యూజిక్ సూపర్‌గా ఉంది. శ్రీ విష్ణు చాలా మంది డైరెక్టర్స్‌ను పరిచయం చేసిన శ్రీ విష్ణు నేను పరిచయం చేసినందుకు నాకు గర్వంగా ఉంది. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్.
చిత్ర దర్శకుడు తేజ మర్ని మాట్లాడుతూ.. మా ఈవెంట్‌కు వచ్చిన అతిథులందరికీ చాలా థాంక్స్. కొత్త కొత్త డైరెక్టర్లకు శ్రీ విష్ణు ధైర్యం. ఈ సినిమా కథ చెప్పగానే ప్రాజెక్టు టేకాఫ్ ఇచ్చినందుకు నిర్మాతలకు థాంక్స్. ఈ కథ రాస్తున్నప్పుడే నేను శ్రీ విష్ణును ఊహించుకున్నాను. సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. సినిమాలో క్యారెక్టర్లను ముందుగానే అనుకున్నాను. మహేష్ రంగస్థలం తర్వాత ఈ చిత్రంలో అంతటి స్థాయిలో ఏమోషనల్ క్యారెక్టర్ చేశాడు. క్లైమాక్స్‌లో ఏడిపించేస్తాడు. కోవిడ్ టైమ్‌లో ఎటువంటి లోటు రాకుండా చూసుకన్న ప్రోడక్షన్ టీమ్స్‌కు థాంక్స్ చెప్పాలి. జోహర్ సినిమా చేస్తున్నప్పుడు జగదీశ్‌ను కలిసినప్పుడు.. నా దగ్గర డబ్బులు లేవని చెప్పాను. నాతో జోహర్ సినిమా చేసినప్పుడు ఉన్నవారే.. ఈ సినిమాకు కూడా పనిచేశారు. స్టేజి మీదకు ఎక్కి మైక్ పట్టుకోవడం నా జీవితంలో ఇదే తొలిసారి. అచ్చమైన తెలుగమ్మాయి కావాలంటే నాకు ఎవరూ దొరకలేదు. రెడ్ చిత్రంలో ఆమె లుక్ చూసిన తర్వాత అమృతను ఫిక్స్ చేశాం. చాలా ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్ అదరగొట్టాడు. పల్లవి, చరణాలు మాకు అక్కర్లేదు. శ్రీ విష్ణుకు కథ చెప్పినప్పుడు ఫస్టాఫ్ విన్నాక ఆయనలో ఒక స్పార్క్ కనిపించింది. సెకాండఫ్ చెప్పగానే సినిమా చేస్తున్నానని చెప్పారు. ఆయన ఇచ్చిన ధైర్యమే నన్ను ఇక్కడ నిలబెట్టింది. మంచి యాక్షన్, బ్యూటిఫుల్ ఏమోషన్‌తో.. సంక్రాంతి ముందే వచ్చిందని అనుకుంటారు. అలా అనుకోకపోతే.. నా దగ్గర సమాధానం లేదు. మా టీమ్ అందరికి థాంక్స్. కాస్టూమ్ డిజైనర్ ప్రసన్న గారు నేను అనుకున్నట్టుగా క్యారెక్టర్లను చూపించారు. నేను పాటల గురించి పెద్దగా ఆలోచించను ఎందుకంటే.. నేను ట్యూన్ పంపిన నాలుగు గంటల్లోనే చైతన్య ప్రసాద్ గారు పాట రాసి పంపిస్తారు. సుధీర్ డైలాగ్స్‌తో సినిమాకు ప్రాణం పోశాడనే చెప్పాలి. మా పీఆర్‌వోలు వంశీ, శేఖర్‌లకు థాంక్స్. వాళ్లిద్దరు సినిమాను జనాల్లోకి ఇంత అద్భుతంగా తీసుకెళ్లారు. డిసెంబర్ 31న అందరూ థియేటర్లలో అర్జున ఫల్గుణ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. శివరాజు, సుబ్బరాజు, పెద్ద నరేష్, దేవీ ప్రసాద్‌లు కూడా నా మీద నమ్మకంతో ఈ సినిమాలో చేశారు. ఎన్టీఆర్ ఫాన్స్ ఎట్టి పరిస్థితుల్లో అసంతృప్తి చెందరు.
హీరోయిన్ అమృత అయ్యర్ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన గెస్టలకు థాంక్స్. నాకు మెంటర్‌గా ఉన్న తిరుమల కిషోర్ గారికి థాంక్స్. నిరంజన్ రెడ్డి గారికి, అన్వేష్ గారికి థాంక్స్. పల్లెటూరిలో ఉన్న శ్రావణి అనే క్యూట్ క్యారెక్టర్ ఇచ్చినందుకు తేజ గారికి థాంక్స్. శ్రీ విష్ణుతొ పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా సింపుల్, హంబుల్, కంఫర్టెబుల్ హీరో. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనిపించింది. ఆ అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. పక్కన ఉన్న అందరూ చాలా బాగా చేయాలని మోటివేట్ చేస్తుంటారు. మహేష్, చైతన్య.. అంతా ఫ్రెండ్స్ అయ్యారు. ఆఫ్ స్క్రీన్‌లో కూడా చాలా సపోర్ట్ చేశారు. డీవోపీ జగదీశ్ గారు స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు. ప్రియదర్శన్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. టీమ్ అందరికి చాలా థాంక్స్. డిసెంబర్ 31న అంతా థియేటర్లలో సినిమా చూడంది. ఇది తెలుగులో నా మూడో సినిమా. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ ఇయర్ పెద్ద సినిమాతో వస్తాను.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ..అర్జున ఫల్గుణ అనేది ఇంత గొప్ప గర్వంగా చెప్పుకోవడానికి కారణం నిర్మాతలు నిరంజ్ రెడ్డి గారు, అన్వేష్ గారు. ఏ రోజు కూడా మమ్మల్ని ఒక్క ప్రశ్న వేయలేదు. 55 రోజులు షూటింగ్ చేశాం. సినిమాను అందరం చాలా ఇష్టపడ్డాం. నాకు మైక్ పట్టుకుని మాట్లాడమే నచ్చదు. జగదీష్ నాకు ఏదో ఒక షాట్‌తో పిచ్చెక్కించాడు. పెద్ద కెమెరామెన్ అవుతాడు. సినిమా మొత్తం పెయింటింగ్‌లా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్ గురించి అందరూ బాగా చెప్పారు.. అతడు మరో బుడ్డి థమన్ కాబోతున్నాడు. సుధీర్ డైలాగ్‌లు చాలా రాశాడు.. గోదావరి జిల్లాల్లో మాటల మాదిరిగా అందరితో చెప్పించారు. తేజ మర్ని పైకి అలా కనిపిస్తున్నాడు గానీ.. పెద్ద ఫైర్ బ్రాండ్. షూటింగ్‌లో షేక్ ఆడించాడు. నేను నిజంగా భయపడ్డాను. మనం సెట్ అవుతామా అని అనుకున్నాను. చాలా ఫోర్స్ ఉన్న డైరెక్టర్. మహేష్, చైతన్య, చౌదరి, అమృత.. తేజ గురించి బాగా చెప్పారు. వాళ్లకు తేజ ఏ కథ చెప్పాడో తెలియదు గానీ.. సినిమా చూశాక నేను హీరోనా..? వీళ్లందరు హీరోలా..? అని అనిపించింది. ప్రతి ఒక్కరు ఇరగదీశారు. నాకు తెలిసి తేజ.. ప్రతి ఒక్క ఆర్టిస్టు దగ్గరకు వెళ్లి నువ్వే ఈ సినిమాకు హీరో అని చేయించి ఉంటాడు. చాలా హ్యాపీగా ఉంది.. ఈ సినిమాలో చాలా మంచి పెర్ఫామెన్స్‌లు చూస్తారు. నేను సినిమాల్లోకి ఉట్టి చేతులతో ఆర్ట్‌ను నమ్ముకుని వచ్చాను. నాకు ఈ రోజు చాలా ఆస్తి ఉంది. కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే ఆస్తి ఉంది. నా ఆస్తి నేను పరిచయం చేసిన నా డైరెక్టర్లు అందరూ. ఈ ఆస్తి వాళ్లు చేసే చేసే సినిమాలకు ఒక రేంజ్‌లకు వెళ్తుంది. మాదాపూర్, కొండాపూర్ దాటేసి.. రియల్ ఎస్టేట్ భూమ్ ఉన్న శంషాబాద్ వైపు వెళ్తున్నాను. నాకు దొరికే డైరెక్టర్లను నేను అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్లు ఏదో గొప్పగా చెప్పారు గానీ.. అంతా మేము కలిసి పనిచేసిందే. గోదావరి గురించి నేను చాలా గొప్పగా చెప్పగలను. అర్జున ఫల్గుణ మొత్తం గోదావరి జిల్లాల్లోనే షూట్ చేశాం. ఒకటి రెండు పర్సెంట్ తప్ప. అందరూ కూడా కాలర్ ఎగరేసి ఇదిరా మా గోదావరి జిల్లాలు అని చెప్పుకొంటారు. నేను ఎప్పుడు కథనే సినిమాగా చేశాను. నా ఫ్రెండ్స్ కామెడీ, ఫ్యామిలీ, బాయ్ నెక్స్ట్ డోర్ సినిమాలు చేయమని చెప్పేవారు. మాస్ సినిమాలు వద్దనే వారు. డిసెంబర్ 31 తర్వాత మీరు చెప్పండి నేను మాస్ సినిమాలకు పనికి వస్తానో రానో మీరు నిజాయితీగా చెప్పండి. సినిమాలో మేము జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. బయట తేజ జూనియర్‌కు పెద్ద ఫ్యాన్. అందరికి కోస్తే రక్తం వస్తుంది.. కానీ తేజకు జూనియర్ ఎన్టీఆర్ వస్తారు. ఆయన పేరు చెబితేనే తేజ ముఖం వెలిగిపోతుంది. సినిమా చూస్తే మేము కష్టపడి చేశామో లేదో మీకే తెలుస్తోంది. అందరూ థియేటర్లకు వచ్చి చూడండి. 10 నిమిషాలకే గోదావరి జిల్లాలకు వెళ్లిపోతారు. 15 నిమిషాలకే కథలోకి వెళ్లిపోతారు అక్కడి నుంచి గోదావరి జిల్లాలో కనిపించే మంచి మనుషుల మనసులు, అమాయకత్వాలు, సంప్రదాయాలు ఇవన్నీ కనిపిస్తాయి. చాలా అట్రాక్ట్ అవుతారు. ఈసారి సంక్రాంతి పండగ డిసెంబర్ 31 నుంచి జనవరి 15 వరకు ఉంటుంది. మల్కల్ లంక అనే ఊరు వాళ్లు చాలా సపోర్ట్ చేశారు. ఆ ఊరు ఈ సినిమాతో ఫేమస్ అవుతుంది. యాక