Advertisement
Google Ads BL

భళా చోర భళా షూటింగ్ పూర్తి


షూటింగ్ పూర్తి చేసుకున్న భళా చోర భళా

Advertisement
CJ Advs

ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో యాక్టివ్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం భళా చోర భళా. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మిస్టరీ చిత్రానికి ఏ. ప్రదీప్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏ. జనని ప్రదీప్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఏ. ప్రదీప్ మాట్లాడుతూ.. సరికొత్త కథాంశంతో భళా చోర భళా చిత్రం తెరకెక్కిస్తున్నాము. ఫుల్ లెంగ్త్ కామెడీ‌తో పాటు మిస్టరీ అంశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. మంచి ఆర్టిస్టులు కుదిరారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరిపి త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం. లక్షణ్ సినిమాటోగ్రఫీ.. సింహ కొప్పర్తి, వెంకటేష్ అద్దంకిల మ్యూజిక్; రవితేజ నిమ్మన ఆర్ట్ వర్క్ హైలెట్‌గా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది. త్వరలోనే విడుదల వివరాలను ప్రకటిస్తాము. సహకరించిన అందరికీ ధన్యవాదాలు.. అని తెలిపారు.

ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీను, వెంకటేష్, రవి కిరణ్, రవి శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: లక్ష్మణ్, ఎడిటింగ్: వెంకటేష్, ఎడిటర్: రాము అద్దంకి, ఆర్ట్: రవితేజ నిమ్మన, సంగీతం: సింహ కొప్పర్తి, వెంకటేష్ అద్దంకి, నిర్మాత: ఏ. జనని ప్రదీప్, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: ఏ. ప్రదీప్.

Bhala chora bhala shooting is complete:

Bhala chora bhala shooting is complete
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs