Advertisement
Google Ads BL

అంతఃపురంలో రాశీ ఖన్నా


అనగనగా ఓ అంతఃపురం. రాజ భవనంలా ఉంటుంది. అందులో ఓ అమ్మాయి ఉంది. యువరాణికి ఏమాత్రం తీసిపోదు. అంతఃపురంలో అమ్మాయి యువరాణిలా కనిపించాలనే ఏమో... రాశీ ఖన్నాను దర్శకుడు సుందర్ .సి ఎంపిక చేశారు. ఆమెను అందాల బొమ్మలా చూపించారు. అంతఃపురంలో సకల సౌకర్యాలు ఉన్నాయి. కానీ, ఆ అమ్మాయి మాత్రం భయపడుతోంది. ఎందుకు? ఏమిటి? అనేది తెలియాలంటే డిసెంబర్ 31న విడుదల అవుతున్న అంతఃపురం సినిమా చూసి తెలుసుకోవాలి. తెలుగులో హిట్ సినిమాలు చేసిన రాశీ ఖన్నా... ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ చేశారు. ఆల్రెడీ రిలీజైన ట్రైల‌ర్‌, సాంగ్స్‌లో అందంగా, అదే సమయంలో అభిన‌యానికి ఆస్కార‌మున్న పాత్ర చేశార‌ని తెలుస్తోంది. రాశీ ఖన్నా స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Advertisement
CJ Advs

రాశీ ఖన్నా ఓ కథానాయికగా, ఆర్యకు జంటగా నటించిన తమిళ సినిమా అరణ్మణై 3. సుందర్ .సి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఇందులో ఆండ్రియా మరో కథానాయిక. ఇందులో సాక్షి అగర్వాల్, వివేక్, యోగిబాబు, మనోబాల ప్రధాన తారాగణం. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమా తమిళనాట మంచి విజయం సాధించింది. తెలుగులో అంతఃపురం పేరుతో గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ విడుదల చేస్తోంది. రెడ్ జెయింట్ మూవీస్ ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో, అవని సినీమాక్స్ ప్రై.లి. ఖుష్బూ సమర్పణలో, బెంజ్ మీడియా ప్రై.లి. ఎ.సి.ఎస్. అరుణ్ కుమార్ సమర్పణలో సినిమాను విడుదల చేస్తోంది.

సుందర్ సి మాట్లాడుతూ మా అరణ్మణై ఫ్రాంచైజీలో వచ్చిన తొలి రెండు చిత్రాలు తెలుగులో చంద్రకళ, కళావతిగా విడుదలై విజయాలు సాధించాయి. ఇప్పుడీ అంతఃపురం కూడా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. ఇందులోని హారర్, కామెడీ సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటాయి. విజువల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటుందీసినిమా. అంతఃపురంలో‌ గ్రాండియర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నెల 31న సినిమా విడుదల చేస్తున్నాం అని అన్నారు.

 

Anthapuram Movie to release on 31st December:

Raashi Khanna Anthapuram Movie to release on 31st December
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs