Advertisement
Google Ads BL

ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్‌


100% తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఆహా... తన తదుపరి షో  తెలుగు ఇండియన్ ఐడల్ ద్వారా  తెలుగు రాష్ట్రాల్లోని అత్యుత్తమ సింగింగ్ టాలెంట్ గుర్తించాలనే ఆశ‌యంతో సరికొత్త అడుగు వేసింది. అందుకోసం తెలుగు వారిలోని గాత్ర ప్ర‌తిభ‌ను వెలికితీయ‌డానికి, స‌రైన వేదిక క‌ల్పించ‌డానికి  ప్రపంచంలోనే అతిపెద్ద పాటల పోటీని తెలుగులోకి తీసుకువస్తోంది ఆహా!. అందులో భాగంగా, 12 సీజ‌న్ల‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అయిన ఇండియ‌న్ ఐడ‌ల్ ప్లాట్‌ఫార్మ్‌ని ద‌క్షిణాదిన తొలి సారిగా, అందులోనూ మ‌న తెలుగులో తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ పేరుతో ప్రారంభిస్తోంది ఆహా. నాన్‌-ఫిక్ష‌న్ స్పేస్‌లో  ప్రారంభం కానున్న ఈ షో గురించి ఇప్ప‌టికే జనాల్లో క్యూరియాసిటీ క‌నిపిస్తోంది. త్వ‌ర‌లోనే సింగింగ్ కాంపిటిష‌న్స్ ఆడిష‌న్స్ కూడా  పూర్తయ్యాయి. 

Advertisement
CJ Advs

ఇండియ‌న్ ఐడ‌ల్ విన్న‌ర్‌గా నిలిచి తెలుగువారికి ఎంతో గ‌ర్వ‌కార‌ణంగా నిలిచిన శ్రీరామ్ చంద్ర .. తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే అంశం. తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ కోసం ఆన్ లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ ఆడిష‌న్స్ జరిగాయి. తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్‌లో పాల్గొనడానికి పాటించాల్సిన గైడ్ లైన్స్‌ను ఆహా విడుదల చేయగా.. వాటిని పాటిస్తూ..ఈ ఆడిషన్స్‌కు 5వేలకు పైగా కంటెస్టెంట్స్ పాల్గొనడం విశేషం. ఇంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే, తెలుగు ఇండియన్ ఐడల్‌కు ఉన్న క్రేజేంటో అర్థం చేసుకోవచ్చు. ఇక త్వరలోనే తెలుగు సినీ ప్రేమికులను అలరించబోతున్న ఈ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందనడంలో సందేహం లేదు. 

2021లో ఆహాలో ఇప్పటికే లవ్‌స్టోరీ, అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే, త్రీ రోసెస్‌, ఒన్‌, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌, అనుభవించురాజా, సర్కార్‌,  చెఫ్‌ మంత్ర, ది బేకర్‌ అండ్‌ ది బ్యూటీ, క్రాక్‌, అల్లుడు గారు, లెవన్త్ హవర్‌, నాంది, సూపర్‌ డీలక్స్, తరగతి గది దాటి, మహా గణేశ, పరిణయం, ఇచట వాహనములు నిలపరాదు... ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.

Sreerama Chandra To Host The Telugu Indian Idol On Aha:

Aha to launch Telugu Indian Idol
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs