Advertisement
Google Ads BL

ఉదయపూర్ లో ఎంపి బాలశౌరి కుమారుని వివాహం


మచిలీపట్నం ఎం.పి. బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ప్రముఖ ప్యాలెస్ నందు వధువు స్నికితతో సోమవారం తెల్లవారు ఝామున ఘనంగా జరిగింది.. ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీల వివాహాలన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ రూపంలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రెండు రోజులు పాటు ఘనంగా జరిగిన వేడుకలలో భాగంగా సంగీత్, హల్ది, పెండ్లి కొడుకు, పెళ్లి కూతురు రిసెప్షన్ తో పాటు వివాహ వేడుకలు రంగ రంగ వైభవంగా జరిగి ఆహుతులను అలరించాయి.

Advertisement
CJ Advs

ఈ వేడుకలో సినీ, రాజకీయ, వ్యాపార వేత్తలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వివాహానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు సతీ సమేతంగా హాజరై నూతన వధూవరులను అశ్వీరదించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వర్యులు పేర్ని నానితో పాటు, అరకు ఎం.పి.మాధవి, రాజ్యసభ సభ్యులు సి.ఎం.రమేష్, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, శాసన సభ్యులు పార్థ సారధి, అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, జోగి రమేష్, రెడ్డి శాంతి, గ్రీన్ కో MD చలమల శెట్టి గోపి, AMR గ్రూప్ అధినేత మహేశ్ రెడ్డి, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు శ్రీనివాస నాయుడు, విడుదల కుమార స్వామి, భైరా దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొని నూతన  వధూవరులను ఆశీర్వదించారు.

Celebs at MP Balasouri son Anudeep wedding:

Celebrities at MP Balasouri son Anudeep wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs