Advertisement
Google Ads BL

డిసెంబ‌ర్ 31న ఆహా లో సేనాప‌తి


డిసెంబ‌ర్ 31న ఆహా లో ప్ర‌సారం అవుతున్న సేనాప‌తి లో స‌రికొత్త రాజేంద్ర ప్ర‌సాద్‌ను చూస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో న‌ట‌కిరిటీ రాజేంప్ర‌సాద్‌

Advertisement
CJ Advs

100 శాతం తెలుగు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫార్మ్ ఆహా త్వరలోనే అచ్చమైన తెలుగు వెబ్‌ ఒరిజినల్‌ సినిమా సేనాపతి తో అలరించనుంది. ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్‌ ఓటీటీలో డెబ్యూ చేస్తున్న సినిమా ఇది. క్రైమ్‌ డ్రామా జోనర్‌లో సాగుతుంది. ప్రేమ ఇష్క్ కాదల్‌ ఫేమ్‌ పవన్‌ సాదినేని దర్శకత్వం వహించారు. సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ నిర్మించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందింది. డిసెంబర్ 31న ఆహాలో సేనాపతి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో..

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇండ‌స్ట్రీలో ఉన్నా కూడా, నిర్మాణ సంస్థ‌లు ఒక‌ట్రెండే ఉన్నాయి. ఇప్పుడు సుష్మిత కొణిదెల‌, విష్ణు వంటి వాళ్లు క‌లిసి గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ అనే ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ను స్టార్ట్ చేయ‌డం చాలా ఆనందాన్ని ఇస్తుంది. కొత్త సినిమాల‌ను చేయ‌డానికి వీళ్లు ముందుకు రావ‌డం గొప్ప విష‌యం. వారి జ‌ర్నీ గొప్ప‌గా ఉండాల‌ని అంటున్నాను. నాకూ, రాజేంద్ర‌ప్ర‌సాద్‌కి మ‌ధ్య 45 ఏళ్ల అనుబంధం ఉంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మా ఇద్ద‌రికీ ప‌నిచేయాల‌నే త‌ప్పన చావ‌లేదు. ఇప్ప‌టికీ ఎందుకు ప‌ని చేస్తుంటారు? అని న‌న్ను చాలా మంది అడుగుతుంటారు. నేను ప‌ని చేయ‌క‌పోతే మూల‌ప‌డిపోతానేమోన‌ని నా భ‌యం. అందుకే నిద్ర లేవ‌గానే ఛాలెంజ్ ఉండాల‌ని కోరుకుంటాను. డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని తొలి సినిమా చూసి త‌న‌ను క‌లిసి మాట్లాడాను. అప్పుడు త‌ను సినిమా చేసిన బ‌డ్జెట్ గురించి తెలుసుకుని షాక‌య్యాను. త‌ను రొమాంటిక్ కామెడీ సినిమాలు బాగా చేస్తాడ‌నే పేరుంది. కానీ సేనాప‌తి వంటి డిఫ‌రెంట్ మూవీని కూడా చేయ‌గ‌ల‌డ‌ని నా న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టినందుకు త‌న‌ను నేను అభినందిస్తున్నాను. త‌ను గీతాఆర్ట్స్‌లో సినిమా కూడా చేయ‌బోతున్నాడు. సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగా ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ వెరీ గుడ్‌. డిసెంబ‌ర్ 31న సేనాప‌తి ఆహాలో విడుద‌ల‌వుతుంది. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు. 

న‌ట‌కిరిటీ రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ.. సినీ ఇండ‌స్ట్రీలో అల్లు రామ‌లింగ‌య్య‌గారితో మంచి అనుబంధం ఉంది. అల్లు రామ‌లింగ‌య్య‌గారు అర‌వింద్ కంటే న‌న్నే బాగా ఇష్ట‌ప‌డేవారు. ఇది ప‌చ్చి నిజం. ఇక నా 45 ఏళ్ల సినీ కెరీర్‌లో మంచి మిత్రుడు అంటే మెగాస్టార్ చిరంజీవిగారే. న‌వ ర‌సాల్లో యాక్ష‌న్‌, కామెడీ అనే ర‌సాల కార‌ణంగా నేను, చిరంజీవి నిలిచిపోయాం. నాకు, అర‌వింద్‌గారి వంటి వారికి ప‌ని లేక‌పోతే మేం బతికిఉన్న‌ట్లే కాదు. ప‌ని ఉంటేనే మేం బ‌తికి ఉన్న‌ట్లుగా భావిస్తాం. కెరీర్ ప్రారంభంలో స‌పోర్టింగ్ రోల్స్ చేసి త‌ర్వాత హీరో అయ్యాను. మ‌ళ్లీ సూప‌ర్ స‌పోర్టింగ్ రోల్స్ చేశాను. 45 ఏళ్ల ప్ర‌యాణం త‌ర్వాత కూడా నాకు ఇంకా ప‌ని దొరుకుతుందంటే కార‌ణం.. నేటి ద‌ర్శ‌కులు, టెక్నిషియ‌న్లే. ఇక రామేశ్వ‌ర‌రావు వంటి వ్య‌క్తి ఆహా వంటి ఓ తెలుగు యాప్‌ను క్రియేట్ చేయాలంటే అందుకు వ‌న్ అండ్ ఓన్లీ అల్లు అర‌వింద్‌గారి స‌పోర్ట్ ఎంతో ముఖ్యం. మ‌రెవ‌రూ ఆయ‌న‌లా చేయ‌లేరు. రాజేంద్ర ప్ర‌సాద్ ఇలా కూడా ఉంటాడా? అని సేనాప‌తి సినిమా చూస్తే అనిపిస్తుంది. నాకంటే యంగ‌ర్ జ‌న‌రేష‌న్ అయిన టీమ్‌తో ప‌నిచేశాను. వాళ్లు ఇన్‌స్పిరేష‌న్ ఇస్తూ వ‌ర్క్ చేయించుకున్నారు. సేనాప‌తితో స‌రికొత్త‌గా ఆహాలో అల‌రించ‌బోతున్నాం. హాయిగా ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయాల‌ని కోరుతున్నాను అన్నారు. 

డైరెక్టర్ పవన్ సాధినేని మాట్లాడుతూ.. అల్లు అరవింద్‌గారితో నాకు మంచి అనుంధం ఉంది. ఇండ‌స్ట్రీలో నేను డైరెక్ట‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న త‌న విలువైన స‌ల‌హాల‌ను ఇస్తూ వ‌స్తున్నారు. ఇక రాజేంద్ర ప్ర‌సాద్‌గారి గురించి ఏం చెప్పినా కొడుకు తండ్రి గురించి మాట్లాడిన‌ట్లే ఉంటుంది. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం గొప్ప అనుభూతిని ఇచ్చింది. సుశ్మిత‌గారు, విష్ణు ప్ర‌సాద్‌గారు క్రియేటివ్‌గా నాకెంతో స‌పోర్ట్‌ను అందిస్తూ వ‌చ్చారు. వారికి నా ధ‌న్య‌వాదాలు. శ్ర‌వ‌ణ్ అద్బుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. గౌత‌మ్ ఎడిటింగ్‌తో ప్రొడ‌క్ట్‌ని నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లాడు. అలాగే ఇత‌ర టెక్నీషియ‌న్స్‌కు థాంక్స్‌ అన్నారు. 

నిర్మాత విష్ణు ప్ర‌సాద్ మాట్లాడుతూ.. అల్లు అరవింద్‌గారికి థాంక్స్‌. ఆయన ఆహా ద్వారా మా సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకెళుతున్నారు. అలాగే రాజేంద‌ప్ర‌సాద్‌గారికి కూడా థాంక్స్‌. ఎందుకంటే ఆయ‌న లేక‌పోతే సేనాప‌తి లేరు. ఆహా టీమ్ ఎంతో స‌పోర్ట్ చేసింది. నా గోల్డ్ బాక్స్ టీమ్‌కు స్పెష‌ల్ థాంక్స్‌ అన్నారు. 

సుష్మిత కొణిదెల మాట్లాడుతూ.. గోల్డ్ బాక్స్ నుంచి చేసిన ప్రతి ప్రాజెక్ట్‌కి కార‌ణం ప్రేక్ష‌కుల ఆశీర్వాదాలే కార‌ణ‌మ‌ని భావిస్తాం. సేనాప‌తి చిత్రాన్ని కూడా మీ అంద‌రికీ ఆశీర్వాదంతో ముందుకు తీసుకొస్తున్నాం. చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌గా ఉంది. ఆహాతో మేం కొలాబ్రేట్ అవుతున్న తొలి ప్రాజెక్ట్ ఇది. రాజేంద‌ప్ర‌సాద్ అంకుల్‌తో ఈ సినిమా చేయ‌డం చాలా స్పెష‌ల్‌గా అనిపించింది. సెట్స్‌లో ఆయ‌న డేడికేష‌న్‌, డిసిప్లెయిన్ చూసి చాలా నేర్చుకున్నాం. ప‌వ‌న్ సాధినేని మంచి సినిమాతో ప్రేక్ష‌కుల‌కు మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాడ‌ని నాకు న‌మ్మ‌కం ఉంది. త‌క్కువ టైమ్‌లో ఇంత మంచి ప్రొడ‌క్ట్ చేయ‌డానికి స‌పోర్ట్ చేసిన గోల్డ్ బాక్స్ టీమ్‌కు థాంక్స్‌ అన్నారు. 

ఇంకా ఈ కార్యక్ర‌మంలో శ్రీవిష్ణు, త‌రుణ్ భాస్క‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య స‌హా చిత్ర యూనిట్ స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Aha on Senapathi movie December 31st :

Senapathi movie pre release event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs