అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహా, వినోదానికి సిసలైన ఇంటి పేరుగా తెలుగు లోగిళ్లలో విరాజిల్లుతున్న ఆహా... ఇప్పుడు సరికొత్త యానిమేషన్ ఒరిజినల్ క్రిస్‌మస్ తాతను డిసెంబర్ 24న విడుదల చేసింది. క్రిస్‌మస్ సందర్భంగా ఈ యానిమేషన్ ఒరిజినల్‌ను విడుదల చేశారు. ఆహా కిడ్స్ లో విడుదలైన రెండో ఒరిజినల్ ఇది. మన కథలు, మన విలువలను పిల్లలకు నేర్పించడానికి, వాళ్లల్లో పాజిటివిటీని పెంచడానికి చేస్తున్నకృషి ఇది.
క్రిస్‌మస్ తాతను రాజీవ్ చిలక దర్శకత్వం వహించారు. గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్ లో జరిగిన కథ ఇది. క్రిస్‌మస్ వెకేషన్‌కి పలువురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు, గురువు, వాళ్ల పెంపుడు జంతువులు వచ్చినట్టు సాగుతుంది స్టోరీ. మైటీ రాజు అతని తల్లిదండ్రులతో పాటు విఘ్నేష్... పెట్స్ మూషిక్, మూబీ కూడా ఉంటారు. బుజ్జి, చిన్న, గోలి సోడ, వాళ్ల గురువు చంద్రముఖి, లవ్లీ సింగ్ అనే పోలీస్, అతని పియాన్సీ తిట్లి, ఆంటోనీ, జేమ్స్, స్వామి, సంధ్య, క్రిస్టఫర్, సాంటా పాత్రలు కూడా ఉంటాయి.
అక్కడ పిల్లలు ఏం చేస్తారు? వాళ్ల బహుమతులను దొంగలించింది ఎవరు? వాళ్ల సీక్రెట్ శాంటా ఎవరు? వంటివన్నీ ఆసక్తికరంగా సాగే అంశారు. ఆడియన్స్ కి వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతో లైవ్లీ పాత్రలతో సరదాగా తెరకెక్కించిన ఒరిజినల్ ఇది. సరదా, సంతోషాలు లేకుంటే అసలు పండగ ఎందుకు అవుతుంది? కాదు కదా... అందుకే ఆహా ఈ యానిమేషన్ ఒరిజినల్‌ని క్రిస్‌మస్ పండుగ సందర్భంగా అందించింది.
పండగలు వస్తున్నాయంటే, ఆ సెలబ్రేషన్స్ ఆహాలో కచ్చితంగా కనిపించాల్సిందే. గణేష్ చతుర్థి సందర్భంగా మహా గణేశను విడుదల చేసింది ఆహా. ఇప్పుడు క్రిస్‌మస్ సందర్భంగా క్రిస్‌మస్ తాతను విడుదల చేసింది. దాదాపు 40 గణేష్ విగ్రహాల మంటపాలకు మహాగణేశను రీచ్ చేసింది ఆహా. ఆఫ్‌లైన్‌లో దాదాపు వన్ మిలియన్ ఆడియన్స్ వీక్షించారు.
పిల్లల కోసం ఈ కంటెంట్ మాత్రమే కాదు, యంగర్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని మరింత కంటెంట్ క్రియేట్ చేస్తోంది ఆహా. దాదాపు 30 కొత్త మేజికల్ స్టోరీస్ రెడీ అవుతున్నాయి. ఆహా లైబ్రరీలో అవన్నీ కొత్త అడిషన్ కాబోతున్నాయి.
2021లో ఆహాలో ఇప్పటికే లవ్‌స్టోరీ, అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే, త్రీ రోసెస్, ఒన్, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, అనుభవించురాజా, సర్కార్, చెఫ్ మంత్ర, ది బేకర్ అండ్ ది బ్యూటీ, క్రాక్, అల్లుడు గారు, లెవన్త్ హవర్, నాంది, సూపర్ డీలక్స్, తరగతి గది దాటి, మహా గణేశ, పరిణయం, ఇచట వాహనములు నిలపరాదు... ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.