Advertisement
Google Ads BL

నా సక్సెస్‌ సీక్రెట్‌ వాళ్లే –డా.మాధవి వెంకట్


నా సక్సెస్‌ సీక్రెట్‌ వాళ్లే –డా.మాధవి వెంకట్ (సెలబ్రిటీ సీక్రెట్స్‌ ఎండి) 

Advertisement
CJ Advs

Click Here: Celebrity Secrets MD Dr. Madhavi Birthday Photos

ఈరోజు నేనెప్పటికి మరిచిపోలేను, నా సక్సెస్‌ సీక్రెట్‌కి కారణం తెలుగు సినిమా పరిశ్రమలోని ఎంతోమంది నటీనటులే. వారితో పాటు దేశంలోని అనేకమంది రాజకీయ, వ్యాపారవేత్తలు నాకు ఆప్తులు అయ్యారంటే దానికి కారణం నా మేకోవర్‌ కంపెనీ ‘సెలబ్రిటీస్‌ సీక్రెట్‌’ అన్నారు డాక్టర్‌ మాధవి. బ్రాండ్‌తో ఒక డాక్టర్‌గానే కాకుండా వారందరి కుటుంబ సభ్యుల్లా నేను అందరిని ట్రీట్‌ చేస్తాను. మొదట నా క్లైయింట్స్‌కి ట్రీట్‌మెంట్‌ చేసేముందు నాకు నేను టెస్ట్‌ చేసుకున్నాక అది సక్సెస్‌ అయితేనే ఆ ట్రీట్‌మెంట్‌ను నా క్లైయింట్స్‌కి చేసి మంచి రిజల్ట్‌ వచ్చేటట్లు చేస్తాను. తద్వారా వాళ్లు రిజల్ట్‌తో సంతృప్తిగా ఉండటంతో మరో పదిమందికి మా క్లినిక్‌ గురించి చెప్పటం వల్ల మౌత్‌ పబ్లిసిటీతో ఇక్కడ వరకు మా ప్రయాణం వచ్చింది. క్లైయింట్సందరూ ఎంజాయ్‌ చేసిన సేవలే నన్ను, మా వారు డాక్టర్‌ వెంకట్‌గారిని ఇంతమందికి దగ్గర చేశాయి అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అన్నారు సెలబ్రిటీ సీక్రెట్స్‌ ఎండి డాక్టర్‌ మాధవి. బుధవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో మరో నూతన ప్రాజెక్ట్‌ను ప్రకటించారామె. డా.మాధవి ఉమెన్ ఎంటర్ ప్రైనర్, ఎస్తటిక్ ఫిజిషియన్, కాస్మేటలజిస్ట్.

ఈ సందర్భంగా డా. మాధవి వెంకట్ మాట్లాడుతూ– ఈ ప్రాజెక్ట్‌ను అతిత్వరలో ప్రారంభిస్తున్నాం అని నా పుట్టినరోజు రోజున ఎనౌన్స్‌ చేయటం ఆనందంగా ఉంది. అలాగే గతంలో హైదరాబాద్, విజయవాడ, కాకినాడల్లోని మా బ్రాంచెస్‌ పెద్ద స్థాయిలో విజయం సాధించటం వెనుక నా టీమ్‌ పడిన తొమ్మిదేళ్ల కష్టాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది  అన్నారు. 

ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు ఆలీ, దివ్యవాణి, సన, రాజారవీంధ్ర, రజిత,హేమ, హిమజ, సురేఖావాణి, జ్యోతి, జయలక్ష్మీ గాయని మంగ్లీ, బిగ్‌బాస్‌ ఫేమ్‌ రాహుల్‌ సిప్లిగంజ్, భాను, ఐఏఎస్ అధికారిణి బాలా కథ, యాంకర్‌ రవి, జెస్సీలతో పాటు జ్ఙాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాత ప్రవీణ కడియాల, అనిల్‌ కడియాల తదితరులు పాల్గొన్నారు.

Celebrity Secrets MD Dr. Madhavi Birthday:

Celebrity Secrets MD Dr. Madhavi Venkat Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs