Advertisement
Google Ads BL

అంచనాలు దాటి సినిమా చేసాం: నాని


న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు శ్యామ్ సింగ రాయ్ యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఈ కార్యక్రమంలో

Advertisement
CJ Advs

రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ..ఇకపై మా జర్నీ ముగిసింది. ఇకపై అంతా ఆడియెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మంచి సినిమా తీశామన్న నమ్మకం ఉంది. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. విజువల్ వండర్‌ను థియేటర్లో చూడాల్సిందే. మీరు సినిమాను చూసి మాకు ఫీడ్ బ్యాక్ ఇవ్వండి. కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో తెలుగు సినిమాలు చాలానే వచ్చాయి. నాకు ఒక వేళ చాన్స్ వస్తే ఎలా చూపిస్తానా? అని అనుకున్నాను. లక్కీగా నాకు అవకాశం వచ్చింది. ఇది పూర్తిగా కల్పిత పాత్రలతో తెరకెక్కించిన చిత్రం. కథ రాసుకున్నప్పుడు నాని గారిని అనుకోలేదు. కానీ నాని గారి వల్ల నేను రాసుకున్న కథ మూడు రెట్లు పెరిగింది. తెరపై అద్భుతంగా వచ్చింది. న్యాచురల్ స్టార్ కాకుండా రాయల్ స్టార్ అని పెడదామని అనుకున్నాను. నాకు ఏ ట్యాగ్ వద్దు అని నాని గారు అన్నారు. అదే నాని గారి గొప్పదనం. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసమైనా సినిమాను చూడాల్సిందే. చాలా రోజుల తరువాత మళ్లీ హిందూస్తానీ సంగీతాన్ని మనకు పరిచయం చేశారు అని అన్నారు.

నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ.. మా సినిమాను థియేటర్‌కు వెళ్లి చూడండి. చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. కొత్త అనుభూతిని ఇస్తామనే నమ్మకం మాకుంది. కథ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టే నాలుగు భాషల్లో సినిమా తీశాం. ఎవరి సినిమాను వాళ్లే జాగ్రత్తగా చూసుకోవాలి. మేం సినిమాను థియేటర్లోనే రిలీజ్ చేయబోతోన్నాం. నాని గారితో సినిమా చేయాలని, ఈ బ్యానర్ ఆయన సినిమాతో మొదలవ్వాలని రెండున్నరేళ్లుగా ఎదురుచూశాను. ఏది ఏమైనా సరే ఆయనే నా హీరో. ఈ సినిమా ఫలితం మీద మాకు నమ్మకం ఉంది. ఇలాంటి సినిమాను తీసినందుకు ఎంతో గర్వంగా ఉంది. వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయ్ పోతాయ్ కానీ.. ఇలాంటి సినిమాను నిర్మించే అవకాశం అందరికీ రాదు అని అన్నారు.

సాయి పల్లవి మాట్లాడుతూ.. రిలీజ్‌కు ముందు చాలా భయంగా ఉంటుంది. ఫస్ట్ డే నుంచి నాని గారి నుంచి ధైర్యాన్ని తీసుకున్నాను. ఫస్ట్ నుంచి సోషల్ మీడియాలో పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. మీ అంచనాలు అందుకునేలా ఉంటుంది. ఈ సినిమాను అందరూ థియేటర్లో చూడండి. నాకు ఎలాంటి రోల్ చేస్తే సంతోషమనిపిస్తే అదే చేస్తాను. ఆ పాత్రను నేను చేయగలనా? లేదా? అని ఆలోచిస్తాను. నేను సినిమాను చూస్తే నాకు నచ్చుతుందా? లేదా? అనే కోణంలోంచి పాత్రలను ఎంచుకుంటాను. శ్యామ్ సింగ రాయ్‌లో నాకే నచ్చిన పాత్రను చేస్తున్నాను. నేను డ్యాన్స్ చేయగలను అని డ్యాన్స్ మూమెంట్స్ పెట్టమని నేను అడగను. పాత్రకు ఎంత కావాలో అంతే చేస్తాం. దేవదాసీలు అంటే ఇలా ఉంటారా? అని అనుకున్నాను. కానీ దర్శకుడు మాత్రం ఓ పాత్రను డిజైన్ చేస్తారు. ఈ పాత్రను చేయడంతో నటిగా ఇంకా ఎదిగానని అనిపిస్తుంది. మేం కామ్రేడ్‌లాంటి వాళ్లం. ఇద్దరికీ నటన అంటే పిచ్చి. మేం ఎప్పుడూ దర్శకులను ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంటాం. నేను ఏడిస్తే జనాలు సినిమాలు చూడరు. నవ్వితేనే చూస్తారు అని అనుకోను. నాకు నచ్చిన పాత్రలు చేస్తూ వెళ్తాను అని అన్నారు.

నాని మాట్లాడుతూ.. రిలీజ్‌కు ముందు మీడియాకు థ్యాంక్స్ చెప్పాలని ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేశాం. మమ్మల్ని మొదటి నుంచి సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. రిలీజ్ ముందు రోజు చాలా టెన్షన్ ఉంటుంది. కానీ ఓ మంచి సినిమా తీశామనే ఓ ఫీలింగ్ మాత్రం ఉంది. సినిమా చూశాక ఆడియెన్స్ ఎలా ఫీల్ అవుతారా? అని గత రెండ్రోజుల నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. యూఎస్‌లో ప్రీమియర్స్ పడతాయి. వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమా ఉంటుంది. అందుకోసం ప్రతీ ఒక్క టీం మెంబర్ కష్టపడ్డారు. ఈ సినిమాను దక్షిణాది భాషల్లోనే విడుదల చేస్తున్నాం. ఈ సినిమాలో చాలా కొత్త విషయాలున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా ఇదే అవుతుంది. ఫస్ట్ కథ విన్నప్పుడే అలాంటి ఫీలింగ్‌ను నేను అనుభూతిని చెందాను. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. అన్ని రకాల జానర్లు ఇందులో ఉంటాయి. ఇందులో ఎమోషనల్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. వాసు నార్మల్ కారెక్టర్. శ్యామ్ ప్రపంచం వేరు. నేను కూడా ఓ ప్రేక్షకుడినే. నాకు నచ్చింది ప్రేక్షకుడికి నచ్చుతుందనిపిస్తుంది. అందుకే కొత్త సినిమాలు చేయాలని అనిపిస్తుంది. సినిమాను ఎంత బాగా చూపించామనేది ముఖ్యం. ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లామా? లేదా? అనేదే ప్రేక్షకులు చూస్తారు. ఏ భాషలోని ప్రేక్షకులు చూసినా కూడా భాషలో తప్పు కనిపించకూడదని బెంగాలీ భాషను నేర్చుకున్నాను. డైలాగ్స్ చెప్పాను. కెమెరామెన్, ఆర్ట్, క్యాస్టూమ్ డిపార్ట్మెంట్ వల్లే నాకు శ్యామ్ సింగ రాయ్ అనే ఫీలింగ్ వచ్చింది. సినిమా హిట్ అవుతుందనే అందరూ చెబుతారు. నేను కూడా అదే చెబుతున్నాను. కానీ ఎంతో నమ్మకంగా,కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా సరే దాన్ని దాటే సినిమాను చేశామని నేను అనుకుంటున్నాను. ఓటీటీలో రిలీజ్ చేసిన సినిమాల పట్ల నిర్మాతలు, నేను అందరం హ్యాపీగానే ఉన్నాం. అప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఓటీటీలో రిలీజ్ చేశాం. కానీ ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లోకి వస్తున్నారు. అందుకే ఎంత మంది చూస్తారో చూడండి. నష్టపోతే మేం నష్టపోతాం. లెక్కలు తరువాత చూసుకుందామని అన్నారు.

Shyam Singha Roy Press Meet:

Nani Shyam Singha Roy Press Meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs