Advertisement
Google Ads BL

శ్రీ విష్ణు భళా తందనాన ఫస్ట్ లుక్


శ్రీ విష్ణు, చైతన్య దంతులూరి, వారాహి చలన చిత్రం భళా తందనాన ఫస్ట్ లుక్ విడుద‌ల‌

Advertisement
CJ Advs

విలక్షణ కథలతో తన మార్క్ చూపెడుతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం భళా తందనాన అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీలో న‌టిస్తున్నారు. బాణం ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్. రీసెంట్‌గా మూవీ  షూటింగ్ పూర్త‌య్యింది. ఇక‌ ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు భళా తందనాన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇన్ సైడ్ వైట్ టీ షర్ట్ ధరించి డెనిమ్ షర్ట్, బ్లూ జీన్స్‌తో ఈ పోస్టర్‌లో కనిపిస్తున్న శ్రీ విష్ణు లుక్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది. చేతిలో రెండు తుపాకులు పట్టుకొని ఎంతో కోపంగా కనిపిస్తున్న శ్రీ విష్ణు చుట్టూ రౌడీ గ్యాంగ్ కనిపిస్తుండటం ఈ కథ ఎంత స్ట్రాంగ్‌గా ఉండనుందో చెబుతోంది. భళా తందనాన చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లకు కొదవే ఉండదని తెలుస్తోంది.

హీరో శ్రీ విష్ణుని ఇప్పటిదాకా చూడని డిఫరెంట్ లుక్‌లో చూపించబోతున్నారు డైరెక్టర్ చైతన్య దంతులూరి. చిత్రంలో కేథ‌రిన్ థ్రెసా రోల్ కి కూడా  ప్రాముఖ్యత ఉండనుంది. ఇక ప్రతినాయకుడిగా కేజిఎఫ్ ఫేమ్ రామచంద్ర రాజు రోల్ మరింత పవర్ ఫుల్‌గా ఉండనుంది. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణి శర్మ బాణీలు కడుతుండగా.. సురేష్ రగుతు కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా రచయితగా, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

నటీనటులు : శ్రీ విష్ణు, కేథరిన్ థ్రెసా, రామచంద్ర రాజు

సాంకేతిక బృందం: దర్శకుడు: చైతన్య దంతులూరి, నిర్మాత: రజనీ కొర్రపాటి, సమర్పణ: సాయి కొర్రపాటి, బ్యానర్: వారాహి చలన చిత్రం, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్, సినిమాటోగ్రఫర్: సురేష్ రగుతు, యాక్షన్ కొరియోగ్రఫర్: పీటర్ హెయిన్, ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్, రచయిత: శ్రీకాంత్ విస్సా, పీఆర్ఓ: వంశీ-శేఖర్.

Bhala Thandanana First Look Out:

<span>Sree Vishnu, Chaitanya Dantuluri, Vaaraahi Chalana Chitram&rsquo;s Bhala Thandanana First Look Out</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs