Advertisement
Google Ads BL

ఆహా.. రాజేంద్రప్రసాద్‌ సేనాపతి.!


వరల్డ్ ఆఫ్‌ సేనాపతి స్నీక్‌పీక్‌ని విడుదల చేసిన ఆహా.. డిసెంబర్‌ 31న ప్రీమియర్‌ కానున్న రాజేంద్రప్రసాద్‌ సేనాపతి.!

Advertisement
CJ Advs

Click Here:👉 World of Senapathi Movie Trailer 

100 శాతం తెలుగు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫార్మ్ ఆహా త్వరలోనే అచ్చమైన తెలుగు వెబ్‌ ఒరిజినల్‌ సినిమా సేనాపతితో అలరించనుంది. ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్‌ ఓటీటీలో డెబ్యూ చేస్తున్న సినిమా ఇది. క్రైమ్‌ డ్రామా జోనర్‌లో సాగుతుంది. ప్రేమ ఇష్క్ కాదల్‌ ఫేమ్‌ పవన్‌ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ నిర్మించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందింది. వరల్డ్ ఆఫ్‌ సేనాపతి పేరుతో ఈ సినిమాలోని పాత్రలు, వాటి లక్ష్యాలు, వాటి పరిసరాలు, వాటి జీవన విధానం వంటివాటిని ప్రేక్షకులకు మంగళవారం పరిచయం చేశారు మేకర్స్. 

గ్లింప్స్ కి విశేషమైన ఆదరణ వస్తోంది. ఈ సినిమా సారాంశాన్ని బుర్ర కథ రూపంలో వివరించారు. పౌరాణిక విశేషాలతో వివరించే ప్రయత్నం చేశారు. జానపద కళాకారుడి గాత్రంలో సేనాపతిని పరిచయం చేసిన తీరు బావుంది. కృష్ణభగవానుడు ఈ కలియుగంలో ఉంటే ఎలా ఉండేది? అనే ప్రస్తావన ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ కృష్ణుడు రెండు అవతారాల్లో ఉంటే, ఒకే లక్ష్యంతో రెండు మార్గాల్లో ప్రయాణిస్తే.. అనే ఆలోచన కూడా ఇంట్రస్టింగ్‌గా ఉంది. చెస్‌ బోర్డ్ మీద వినిపించే రాజేంద్రప్రసాద్‌ ఫైనల్‌ డైలాగ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌. 

పోలీసుల నుంచి క్రిమినల్స్ వరకు, వాళ్ల సెట్‌బ్యాక్స్, వాళ్ల జీవితాల్లో డ్రామా.. ఇలా చాలా అంశాలున్నాయి వరల్డ్ ఆఫ్‌ సేనాపతి లో మునుపెన్నడూ చూడని విధంగా మూర్తి పాత్రలో కనిపిస్తారు రాజేంద్రప్రసాద్‌. నరేష్‌ అగస్త్య పోలీస్‌గా నటించారు. జ్ఞానేశ్వరి కాండ్రేగుల, హర్షవర్ధన్‌, జోష్‌ రవి, జీవన్‌ కుమార్‌, రాకేందు మౌళి సపోర్టింగ్‌ పాత్రలు చేశారు. త్వరలోనే ఆహాలో ప్రీమియర్‌ కానుంది సేనాపతి.

ఈ ఏడాది ఆహా తమ ప్రేక్షకులకోసం లవ్‌ స్టోరీ, ఎన్‌బీకేతో అన్‌స్టాపబుల్‌, త్రీ రోజెస్‌, ఒన్‌, మంచి రోజులొచ్చాయ్‌, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌, అనుభవించు రాజా, సర్కార్‌, చెఫ్‌  మంత్ర, ది బేకర్‌ అండ్‌ ద బ్యూటీ, క్రాక్‌, అల్లుడు గారు, లెవన్త్ హవర్‌, నాంది, సూపర్‌ డీలక్స్, తరగతి గది దాటి, మహా గణేశ, పరిణయం, ఇచట వాహనములు నిలుపరాదు.. ను ప్రదర్శిస్తోంది.

World of Senapathi Movie Trailer:

World of Senapathi Movie aha Premieres Dec 31st
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs