Advertisement

ఈ నెల 25 న థియేటర్లలో సందడి చేయబోతున్న విక్రమ్


 బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ పతాకంపై నాగవర్మ బైర్రాజు హీరోగా,  దివ్యాసురేశ్ హీరోయిన్ గా, ఇంకా

Advertisement

,ఆదిత్య ఓం, పృథ్వి రాజ్, సురేష్, చలపతిరాజు, ఖయ్యుమ్, సూర్య, జ్యోతి, తాగుబోతు రమేష్ నటీనటులు గా హరిచందన్ దర్శకత్వంలో నాగవర్మ బైర్రాజు నిర్మిస్తున్న చిత్రం విక్రమ్ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం తెలుగు లో విక్రమ్ గా,తమిళ్ లో మహావీరన్ గా  రెండు భాషల్లో మూడు రాష్ట్రాలలో ఈ నెల 25 న గ్రాండ్ గా విడుదల అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా* 

చిత్ర దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ ..తమిళ్ లో  మహావీరన్ గాను తెలుగులో విక్రమ్ గాను రెండు భాషల్లో మూడు రాష్ట్రాలలో 150 థియేటర్స్ లలో ఈ సినిమాను ఈ నెల 25 న విడుదల చేస్తున్నాము. ఈ నవతరంలో ఉన్న ప్రేమికులు వారి మధ్యన జరిగే సందర్భాలు గాని,సన్ని వేశాలు గాని,  సంఘటనలు గాని అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు వారు ప్రవర్తించే విధానంగాని అప్పుడు ఆ ప్రేమలో గెలవడానికి ఆ విక్రమ్ అనే పాత్ర ఏ విధంగా చేసింది. తన ప్రేమ గెలిచిందా లేదా..  సమాజంలో ఎదురయ్యే చిన్న, పెద్ద సమస్యలను వారు ఎలా ఎదుర్కొన్నారు అనేదే కథ ఇది పక్కా యాక్షన్ డ్రామా లవ్ స్టొరీ..ఇందులో నాగ వర్మ గారు హీరో గా పరిచయం అవుతున్నారు. తను ఈ పాత్రకు తగ్గట్టు చాలా కష్టపడి చేశారు. తనకు ఈ సినిమా తర్వాత మంచి అవకాశాలు వస్తాయి. మహా క్యారెక్టర్ లో హీరోయిన్,మరియు ఆదిత్య ఓం, అలీ తమ్మడు కయ్యుమ్, పృద్వీ,జ్యోతి ఇలా  వీరంతా చాలా ముఖ్యమైన రోల్ చేస్తున్నారు.అలాగే టెక్నిసిషన్స్ అందరూ చాలా కో ఆపరేట్ చేశారు.,తెలుగు, తమిళ్ లో ఒకే సారి విడుదల చేస్తున్నాం. ఈ నెల 25 న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము 

హీరో, నిర్మాత నాగ వర్మ మాట్లాడుతూ .. విక్రమ్ అనే ఓ సినిమా రచయిత పాత్ర చుట్టూ తిరిగే ఈ చిత్రకథలోని పాత్రలు సమాజానికి దగ్గరగా... మనం నిత్యం చూసే వ్యక్తుల పాత్రలు మాదిరిగా సహజంగా ఉంటాయి.  తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ సినిమా రచయిత ఏం చేశాడు అన్నది ఆసక్తికరంగా చెప్పాం ప్రి,పోస్ట్ ప్రొడక్షన్ లో అందరూ చాలా కష్టపడి వర్క్ చేశాము. మాస్ యాక్షన్ సీన్స్ బాగా వచ్చాయి.ఆదిత్య ఈ సినిమాకు ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు.పృద్వి,కయ్యుమ్ ఇలా అందరినీ చూసి ఎంతో నేర్చుకున్నాను.నా ఫస్ట్ మూవీ పెద్ద ఆర్టిస్టులతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

నటుడు ఆదిత్య ఓం మాట్లాడుతూ ..ఇందులో నేను నెగెటివ్ రొలె చేశాను.సంగీతభరిత ప్రేమ కథకు థ్రిల్లర్ అంశాలను మేళవించి కొత్తపంధాలో ఈ చిత్రాన్ని మలిచారు.సినిమా బాగా వచ్చింది.ఈ సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

సంగీత దర్శకుడు సురేష్ ప్రసాద్ మాట్లాడుతూ .. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడుకున్న లవ్ స్టొరీ గా తెరకెక్కించారు. ఇందులో నేను మంచి పాటలు అందించాను. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో బాగా వచ్చింది. ఇలాంటి మంచి మూవీకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలన్నారు. 

Vikram releasing on 25th December:

Vikram movie release Press meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement