Advertisement
Google Ads BL

అఫీషియల్: తొలి రోజు 71 కోట్ల ట..!


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌ట విశ్వ‌రూపానికి ప్రేక్ష‌కనీరాజ‌నం, తొలి రోజునే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 71 కోట్లు వ‌సూళ్లు చేసిన పుష్ప ది రైజ్.

Advertisement
CJ Advs

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ పుష్ప: ది రైజ్ శుక్రవారం (డిసెంబర్ 17) వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల అయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన మరియు యాక్షన్ సన్నివేశాలకు సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. తగ్గేదే లే అంటూ పుష్పరాజ్ అనే ఊర మాస్ అవతారంలో బన్నీ అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేశారు. సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై నడిపించారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ తో ప్రేక్షకులు ఘనస్వాగతం పలికారని ఈ సినిమా నిర్మాత‌లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు.

పుష్ప: ది రైజ్ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 71 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిందని చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇది 2021లో ఇండియాలోనే తొలి రోజు అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమా అని.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని మేకర్స్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలానే నైజామ్ ఏరియాలో దాదాపు 11.5 కోట్లు షేర్ క‌లెక్ట్ చేసి, ఆ ఏరియాలోనే విడుద‌లైన తొలిరోజునే అత్య‌ధిక వ‌సూళ్ల రాబ‌ట్టిన సినిమాగా పుష్ప ది రైజ్ స‌రికొత్త రికార్డు అందుకుంది. 

అని ఆఫీసియల్ గా టీం ప్రకటించి పోస్టర్ రిలీజ్ చేసింది.

71 crores worldwide on the first day Pushpa collection :

71 crores worldwide on the first day Pushpa collection 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs