Advertisement
Google Ads BL

డిసెంబర్ 31న అర్జున ఫల్గుణ


డిసెంబర్ 31న విడుదల అవుతున్న శ్రీ విష్ణు, తేజ మర్ని, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అర్జున ఫల్గుణ

Advertisement
CJ Advs

కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. నూతన సంవత్సరం సందర్బంగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాన్ని అందించేందుకు సిద్దమైంది.  ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో శ్రీవిష్ణు, అమృతా అయ్యర్‌లతో పాటు మిగిలిన నటీనటులు కనిపిస్తున్నారు. త్వరలో చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ స్వరపరిచిన పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. పి. జగదీష్ చీకటి.. సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

ఈ చిత్రంలో శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక బృందం: నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, సహ నిర్మాత: ఎన్ ఎమ్ పాషా, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: తేజ మర్ని, డైలాగ్స్: సుధీర్ వర్మ. పి, సినిమాటోగ్రపీ: జగదీష్ చీకటి, ఆర్ట్ డైరెక్టర్: గంధి నడికుడికర్, యాక్షన్: రామ్ సుంకర, మ్యూజిక్ డైరెక్టర్: ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్, లిరిక్స్: చైతన్య ప్రసాద్, పబ్లిసిటీ డిజైన్: అనిల్&భాను, పీఆర్వో: వంశీ-శేఖర్, కాస్ట్యూమ్ డిజైనర్: ప్రసన్న వర్మ దంతులూరి.

Arjuna Phalguna release date announced :

Arjuna Phalguna Releasing On December 31st
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs