Advertisement
Google Ads BL

బిగ్ బాస్ ఫేమ్ మానస్ 5జి లవ్


బిగ్ బాస్ ఫేమ్ మానస్ హీరోగా నూతన చిత్రం 5జి లవ్

Advertisement
CJ Advs

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన మానస్ నాగులపల్లి అనంతరం హీరోగా, విలక్షణ నటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా మంచి కథా బలం ఉన్న చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ తన నైపుణ్యాన్ని చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్5 లో కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన గేమ్ తో అలాగే మెచ్యూర్డ్ థింకింగ్ తో అటు కుటుంబ ప్రేక్షకుల్ని ఇటు యువతని అమితంగా ఆకట్టుకున్నాడు. కాగా మానస్ బిగ్ బాస్ క్రేజ్ వల్ల అతను నటించిన సినిమాలకు కూడా ప్లస్ అవుతుంది. ఈ ఏడాది అతను హీరోగా నటించిన క్షీర సాగర మథనం చిత్రం ప్రేక్షకాధరణ పొందింది. మానస్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన టైములో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదలవ్వగా ఇక్కడ కూడా అనూహ్య స్పందన దక్కించుకుంది.

ఇక హౌస్ నుండీ బయటకి వచ్చిన వెంటనే మానస్ మరిన్ని ప్రాజెక్టులతో బిజీ కానున్నాడు. ముందుగా 5జి లవ్ అనే చిత్రంలో మానస్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. స్క్వేర్ ఇండియా స్టూడియోస్  బ్యానర్ పై ప్రతాప్ కోలగట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ప్రతాప్ కోలగట్ల, 3జి లవ్ అనే యూత్ ఫుల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాన్ని నిర్మించారు. రాజ్ ముదునూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. కథ ప్రకారం ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారు.పలు హిట్ చిత్రాలకి సంగీతం అందించిన శేఖర్ చంద్ర 5జి లవ్ కి సంగీత అందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఈ చిత్రం రూపొందనుందని చిత్రబృందం తెలిపింది.

టైటిల్: 5జి లవ్, నటీనటులు: మానస్ నాగులపల్లి, బ్యానర్: స్క్వేర్ ఇండియా స్టూడియోస్, దర్శకత్వం: రాజ్ ముదునూరు, సంగీతం: శేఖర్ చంద్ర, నిర్మాత: ప్రతాప్ కోలగట్ల, పిఆర్వో: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

Bigg Boss Fame Manas in 5G Love movie :

5G Love is the new movie with Bigg Boss Fame Manas as the hero
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs