Advertisement
Google Ads BL

ఆహా స్టూడియో తొలి బై లింగువ‌ల్ వెబ్ సిరీస్ హాఫ్ ల‌య‌న్‌


గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకోవ‌డానికి తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా మ‌రో అడుగు ముందుకేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌కి సంబంధించిన కంటెంట్ స్టూడియో అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో క‌లిసి పాన్ ఇండియా బై లింగువ‌ల్ వెబ్ సిరీస్ హాఫ్ లయన్ రూపొందించ‌డానికి సిద్ధ‌మైంది. భార‌తదేశ మాజీ ప్ర‌ధాని పి.వి.న‌ర‌సింహారావుపై రాసిన పుస్త‌కం హాఫ్ ల‌య‌న్‌ ను ఆధారంగా చేసుకుని ఈ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించ‌నున్నారు. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌ముఖ నిర్మాత‌..గీతా ఆర్ట్స్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌.. ఆహా ప్ర‌మోట‌ర్ అల్లు అర‌వింద్‌, అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీఈఓ స‌మీర్ నాయ‌ర్ ముంబైలో వెలువ‌రిచారు. 

Advertisement
CJ Advs

పి.వి.న‌ర‌సింహారావుకి సంబంధించిన విశేషాల‌ను తెలియ‌జేస్తూ విన‌య్ సీతాప‌తి రాసిన పుస్త‌కం హాఫ్ ల‌య‌న్‌. గంగాజ‌ల్‌, అప‌హ‌ర‌ణ్‌, రాజ్‌నీతి వంటి సోషియో పొలిటిక‌ల్ చిత్రాలు..అవార్డ్ విన్నింగ్ డ్రామా సిరీస్ అస్త్రం వంటి వాటితో ప్రేక్ష‌కుల మెప్పును పొందిన ద‌ర్శ‌కుడు.. జాతీయ అవార్డ్ గ్రహీత అయిన దర్శకుడు ప్రకాష్ ఝా ఈ సిరీస్‌ను తెర‌కెక్కించ‌నున్నారు. 2023లో ‘హాఫ్ ల‌య‌న్‌’ తెలుగు, హిందీ, త‌మిళంలో విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా...

ప్ర‌ముఖ నిర్మాత‌..గీతా ఆర్ట్స్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌.. ఆహా ప్ర‌మోట‌ర్ అల్లు అర‌వింద్ మాట్లాడుతూ ఆహాతో తెలుగులో సాగుతున్న మా జ‌ర్నీ మ‌రుపురానిద‌నే చెప్పాలి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్ష‌కుల ప్రేమ‌, ఆద‌రాభిమానాల‌తో రెండేళ్ల‌లోనే ఆహా యాప్ చాలా త్వ‌రిత గ‌తిన అభివృద్ధి చెందింది. ఈ క్ర‌మంలో ఆహా మ‌రో గొప్ప నిర్ణ‌యం తీసుకుంది. ఆహా స్టూడియో, బెస్ట్ క్రియేటివ్ టాలెంట్‌తో వ‌ర‌ల్డ్ క్లాస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను గ్లోబ‌ల్ ఆడియెన్స్‌ను అందించ‌డానికి నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మీర్ నాయ‌ర్‌గారితో భాగ‌స్వామ్యం కావ‌డంతో ఎంతో ఆనందంగా ఉంది. మ‌న భార‌త మాజీ ప్ర‌ధాని పి.వి.న‌ర‌సింహా రావుగారి క‌థ‌ను గ్లోబ‌ల్ ఆడియెన్స్‌కు అందించే అవ‌కాశం రావ‌డం ఎంతో ఆనందంగా భావిస్తున్నాను అన్నారు. 

అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీఈఓ స‌మీర్ నాయ‌ర్ మాట్లాడుతూ దేశంలోని కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ స‌రికొత్త కంటెంట్‌ను అందించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. ఈ క్ర‌మంలో ఆహా స్టూడియో క‌లిసి ప‌నిచేయ‌డం కొత్త అధ్యాయమ‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో మేం క‌లిసి పి.వి.న‌ర‌సింహారావుగారి బ‌యోపిక్ చేస్తున్నాం. మా కాంబినేష‌న్ అనేది స‌రిహ‌ద్దుల‌ను చేరిపేసే కంటెంట్‌ను క్రియేట్ చేస్తుంద‌ని భావిస్తున్నాం. భాష ప‌ర‌మైన హ‌ద్దుల‌ను చెరిపేసి స‌రికొత్త క‌థ‌ల‌ను ప్రేక్ష‌కుల‌ను అందిస్తాం. ఆహా స్టూడియో ద్వారా మాతో క‌లిసి ఇలాంటి సరికొత్త అధ్యాయానికి నాంది ప‌లికిన అల్లు అర‌వింద్‌గారికి ధ‌న్య‌వాదాలు. మా తొలి ప్ర‌య‌తాన్ని ఆవిష్క‌రిస్తున్న ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ ఝా గారికి కూడా థాంక్స్‌. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని కొత్త ప్రాజెక్టుల‌ను రూపొందిస్తాం అన్నారు. 

ద‌ర్శ‌కుడు ప్ర‌కాశ్ ఝా మాట్లాడుతూ రియల్ లైఫ్ స్టోరీస్, సబ్జెక్ట్స్‌పై వర్క్ చేయడం ఎప్పుడూ చాలా కొత్తగా, ఎగ్జ‌యిటింగ్‌గా అనిపిస్తుంది. ఆహా వంటి మాధ్య‌మంలో ఇలాంటి కాన్సెప్ట్స్ చేయ‌డం అనేది హ్యాపీగా ఉంది. ఇక అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇప్ప‌టికే కంటెంట్‌ను క్రియేటింగ్‌లో ఎస్టాబ్లిష్ అయ్యింది. అలాంటి సంస్థ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావ‌డం అనేది ఎగ్జ‌యిట్‌మెంట్‌ను మ‌రింత పెంచుతుంది. ఈరోజు దేశం ఇలా ముందుకు వెళుతుందంటే, అందుకు కార‌ణంగా ఉండి ఎంతో కీల‌క‌మైన పాత్ర‌లు పోషించిన వ్య‌క్తుల్లో ఒక‌రైన పి.వి.న‌ర‌సింహారావు. ఆయన గురించి సిరీస్ చేయ‌డం ఆనందంగా ఉంది. నేటి త‌రం ఆయ‌న నుంచి నేర్చుకోవాల్సిన విష‌యాలు ఎన్నో ఉన్నాయ‌నేది నా న‌మ్మ‌కం అన్నారు.

Aha Studio first bilingual series- Half Lion:

Aha Studio and Applause Entertainment come together to unveil their first bilingual series- Half Lion
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs