Advertisement
Google Ads BL

శ్యామ్ సింగరాయ్ తో కొత్త ఫ్లేవ‌ర్ -మిక్కీ జే మేయర్


శ్యామ్ సింగ రాయ్ తో సిరివెన్నెల గారి లాంటి లెజెండ్‌తో ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను -మిక్కీ జే మేయర్

Advertisement
CJ Advs

న్యాచురల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. డిసెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ  సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ ఇంట‌ర్వ్యూ..

శ్యామ్ సింగరాయ్ కథ రెండు టైమ్ పీరియడ్స్‌కు సంభందించింది. గతం, వ‌ర్త‌మానం అంటూ రెండు భాగాల్లో ఈ క‌థ‌ జరుగుతుంది. గ‌తంలో 70వ దశకంలోని వాతావరణాన్ని ఇందులో చూపించనున్నారు. దానికి తగ్గట్టే సంగీతం, నేప‌థ్య సంగీతం అందించాను. నాకు ఇండియ‌న్ ఇన్‌స్ట్రుమెంట్స్ మీద మంచి నాలెడ్జ్ ఉంది. కాబ‌ట్టి ఆ కాలంలో ఉపయోగించిన వాయిద్యాలనే ఇందులో ఎక్కువ‌గా ఉపయోగించాం. తబల, సితార్, సంతూర్ వంటి వాటిని వాడి సంగీతాన్ని అందించాను.

శ్యామ్ సింగరాయ్ సినిమాలో నార్త్, సౌత్ ఫ్లేవర్ కలిసి ఒక కొత్త ఫ్లేవ‌ర్ ఉంటుంది. క‌ల‌క‌త్తా బ్యాక్‌డ్రాప్ కాబ‌ట్టి  బెంగాల్ సంగీతాన్ని కూడా ఇందులో జోడించాం. కథకు తగ్గట్టుగానే మ్యూజిక్ చేశాను. టాలీవుడ్‌లో ఇలాంటి నేపథ్యంలో రాబోతోన్న మొదటి సినిమా ఇదే అవుతుంది.

ద‌ర్శ‌కుడు రాహుల్ ఈ క‌థ చెప్ప‌గానే చాలా ఎగ్జ‌యిట్ ఫీల‌య్యా...ఎందుకంటే ఈ సినిమాకు మంచి సంగీతం అందించే స్కోప్ ఉంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా చెయ్యొచ్చు అనిపించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ విడుద‌లైన అన్ని పాట‌ల‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. సినిమా రిలీజ‌య్యాక పాట‌ల‌కు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు మ‌రింత మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాను.

సిరివెన్నెలగారి లాంటి లెజెండ్‌తో ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయ‌న‌తో గ‌డిపిన ప్ర‌తి మూమెంట్ ఒక మెమ‌ర‌బుల్‌. శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం ఆయ‌న రెండు పాటలు రాశారు. అందులో సిరివెన్నెల‌ పాట ఆల్రెడీ విడుదలై మంచి స్పందన రాబ‌ట్టుకుంది. ఆయన రాసిన ఇంకో పాట త్వ‌ర‌లో విడుద‌ల కాబోతుంది. ఆ పాట‌లో సిరివెన్నెలగారి సాహిత్యం అద్బుతంగా ఉంటుంది. ఆ పాటను కంపోజ్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది.

పాట ఏ సింగ‌ర్ తో పాడించాలి అనే విష‌యంలో హీరో, దర్శకుల నుంచి నేను సలహాలు తీసుకుంటాను. కానీ తుది నిర్ణయం మాత్రం నాదే. ఎందుకంటే ఆ పాట ట్యూన్ చేసేట‌ప్పుడే అది ఎవ‌రు పాడితే బాగుంటుంది అనేది నిర్ణ‌యించుకుంటాను. ఈ సినిమా మ్యూజిక్, ఆర్ఆర్ ప్రేక్ష‌కుల్ని ఎక్క‌డా డీవియేట్ కానివ్వ‌దు.  

ప్రస్తుతం నేను నందినీ రెడ్డి స్వప్నా దత్ కాంబినేషన్‌లో ఓ సినిమాకు సంగీతం అందిస్తున్నాను, అలాగే  శ్రీవాస్ గోపీచంద్ కాంబినేష‌న్‌లో ఒక  ప్రాజెక్ట్ ఉంది, దిల్ రాజుగారి బ్యానర్‌లో మరో సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాను. వీటితో పాటు ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో ప్రైవేట్ ఆల్బమ్స్‌ కూడా చేస్తున్నాను.

Mickey j meyer interview :

SHYAM SINGHA ROY RELEASE ON DEC 24th 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs