Advertisement
Google Ads BL

ఫిబ్రవరి 2022 గుర్తుందా శీతాకాలం విడుదల


ఫిబ్రవరి 2022లో టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్, తమన్నా భాటియా గుర్తుందా శీతాకాలం విడుదల

Advertisement
CJ Advs

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగ శేకర్ తెరకెక్కిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ప్ర‌తీ ఒక్క‌రు త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విష‌యాల్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌ణ‌లు ప్రేక్ష‌కుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో నాగ‌శేఖ‌ర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్ మరియు వేదాక్షర ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాతలు భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం.

ఇప్ప‌టికే ఈ సినిమా టైటిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. టాలెంటెడ్ హీరో స‌త్యదేవ్, త‌మ‌న్నా, మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి బాగా పెరిగిపోయింది. ఇండ‌స్ట్రీలో వ‌ర్గాల్లోనూ ఈ సినిమాపై ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన గుర్తుందా శీతాకాలం చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందులో సత్యదేవ్, తమన్నా ఒకర్నొకరు రొమాంటిక్‌గా చూసుకుంటూ చేతులు కలుపుకుని ఉన్నారు. ఈ ఫోటో అభిమానులకే కాదు అందరికీ బాగా నచ్చేస్తుంది. సినిమాను ఫిబ్రవరి 2022లో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

నటీనటులు: స‌త్య‌దేవ్, త‌మ‌న్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియద‌ర్శి త‌దిత‌రులు

టెక్నికల్ టీం: స్కీన్ ప్లే, డైరెక్ష‌న్ - నాగ‌శేఖ‌ర్, బ్యాన‌ర్ - నాగశేఖ‌ర్ మూవీస్, స‌మ‌ర్ప‌కులు - ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు, నిర్మాతలు - భావ‌న ర‌వి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి, ప‌బ్లిసిటీ డిజైన‌ర్స్ - అనిల్, భాను, కొరియోగ్రఫి - వీజేశేఖ‌ర్, లైన్ ప్రొడ్యూస‌ర్స్ - సంప‌త్, ఎక్సీక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - న‌వీన్ రెడ్డి, రాఘవ సూర్య, డైలాగ్స్ - ల‌క్ష్మీ భూపాల్, మ్యూజిక్ - కాల‌భైర‌వ‌, ఎడిటిర్ - కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, సినిమాటోగ్రాఫ‌ర్ - స‌త్య హెగ్డే,స్టంట్స్ - వెంక‌ట్, PRO - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్.

Gurthunda Seethakalam Release Date:

Gurthunda Seethakalam February 2022 in Theatres 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs