విలక్షణమైన సీరియల్స్ అందించడంలో మొదటి నుంచీ తన ముద్ర తో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్న స్టార్ మా ఇప్పుడు మరో సరికొత్త ధారావాహిక సిద్ధం చేసింది. అదే కలసి ఉంటే కలదు సుఖం. కుటుంబం లో అనుబంధాలను కొత్తగా ఆవిష్కరించనుంది.
ఓ అమ్మ కథగా మొదలై కుటుంబంలో వున్న వాస్తవాలను బయటపెట్టే కొత్త రకం కథ ఇది. ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను అలరించి, ఎన్నో విభిన్న పాత్రలతో అద్భుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి ప్రభ ఈ సీరియల్ లో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.
ఎంతో శక్తివంతంగా ప్రతి పాత్ర ప్రత్యేకంగా ముస్తాబైన ఈ ధారావాహిక ఈ నెల 13న (సోమవారం) మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమవుతుంది.
ప్రతి కుటుంబం తమదే అనుకునేలా వుండే ఈ కథ స్టార్ మా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వబోతోంది. బంధాలకి బాధ్యతలకు మధ్య సంఘర్షణగా ఈ ధారావాహికని చెప్పొచ్చు.
కలసి ఉంటే కలదు సుఖం ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://youtu.be/Iagr1T82BJI
Content Produced by: Indian Clicks, LLC