Advertisement
Google Ads BL

హ‌ను-మాన్‌ నుంచి అమృత అయ్యర్ ఫస్ట్ లుక్‌


స‌రికొత్త‌ కాన్సెప్ట్‌ల‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో క్రియేటివ్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ వర్మది ప్రత్యేక శైలి. ప్ర‌స్తుతం మరో సారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చూట్టారు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. హ‌ను-మాన్ చిత్రం ద్వారా  తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ జోనర్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు.  మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీగా యంగ్‌ హీరో తేజ సజ్జతో క‌లిసి ప్రశాంత్ వర్మ తెర‌కెక్కిస్తోన్న హను-మాన్  సినీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ కానుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు హనుమంత హార్ట్ బీట్‌ను మేకర్స్ ప్రకటించారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలోని హీరోయిన్ అమృత అయ్యర్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అంజనాద్రి ప్రపంచంలోని మీనాక్షి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను నేడు విడుదల చేశారు.

Advertisement
CJ Advs

సూపర్ హీరో స్టైల్లో తేజ సజ్జాకు సంబంధించిన పరిచయం జరగ్గా.. ఇప్పుడు అమృతా అయ్యర్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించారు. చుట్టూ అందమైన ప్రకృతి, పక్షులతో అలా పడవలో మీనాక్షి ప్రయాణం చేస్తోంది. ఓ దేవకన్యలా కనిపిస్తున్న అమృతా అయ్యర్.. ఈ పాత్రకు సరిగ్గా సరిపోయారు. తేజ సజ్జ సూపర్ హీరో పాత్ర పోషించడానికి స్ట‌న్నింగ్‌ మేక్ఓవర్ అయ్యారు. తేజ గెటప్ చాలా భిన్నంగా ఉంది.

జాంబీ రెడ్డి కాంబో మ‌రోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ద‌మైంది. మన పురాణాలు ఇతీహాసల్లో అద్భుతమైన శక్తులు ఉన్న సూపర్‌హీరోస్‌ గురించి మనకు తెలుసు. వారి అపూర్వమైన శక్తులు, బలాలు, పోరాటపటిమ అద్భుతమైనవి. సూపర్ హీరోస్‌ చిత్రాల్లోని హీరో ఎలివేషన్స్, యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తాయి. అలాగే  సూప‌ర్ హీరో మూవీస్‌ని అన్ని వ‌ర్గాల వారు ఇష్ట‌ప‌డ‌తారు. హ‌ను-మాన్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో రూపొందుతోంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

Vijay Sethupathi Introduces Amritha Aiyer As Meenakshi HANU-MAN:

<span>Makkal Selvan Vijay Sethupathi Introduces Amritha Aiyer As Meenakshi From The World Of Anjanandri In Prasanth Varma, Teja Sajja, Primeshow Entertainment HANU-MAN</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs