Advertisement
Google Ads BL

ఆహా సరికొత్త ఒరిజిన‌ల్ ఫిలిం సేనాప‌తి..


మారుతున్న ట్రెండ్‌ను అనుస‌రిస్తూ ప్రపంచంలోని తెలుగు ప్రేక్ష‌కుల‌కు 100 ప‌ర్సెంట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్రారంభ‌మైన తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా. తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఎల్ల‌ప్పుడూ అందిస్తామ‌ని ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటూ ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ప్రేక్ష‌కులకు సంతోషాన్ని అందిస్తూ అల‌రిస్తున్న తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో మ‌రో కొత్త వెబ్ సిరీస్ రానుంది. అదే.. సేనాప‌తి. ఈ రిడెంప్ష‌న్ డ్రామా ద్వారా టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు, న‌ట కిరిటీ రాజేంద్ర‌ప్ర‌సాద్ ఓటీటీ ఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం. ప్రేమ ఇష్క్ కాద‌ల్ వంటి చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ సాధినేని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల మరియు విష్ణు ప్ర‌సాద్ ఈ సిరీస్‌ను నిర్మించారు. న‌రేష్ అగ‌స్త్య, జ్ఞానేశ్వ‌ర్ కందేర్గుల‌, హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌, రాకేందు మౌళి త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. 

Advertisement
CJ Advs

ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ‘సేనాప‌తి’ సిరీస్ మోష‌న్ పోస్ట‌ర్‌ను మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆదివారం( ఇవాళ) విడుద‌ల చేశారు. ఓ తాత‌య్య త‌న మ‌న‌వ‌డితో మాట్లాడుతున్న‌ట్లు మోష‌న్ పోస్ట‌ర్ ప్రారంభం అవుతుంది. అందులో ఓ రాజు..ఆయ‌న ఏడుగురు కొడుకులు చేపల వేట‌కి వెళతారు. దానికి  సంబంధించిన క‌థ‌ను రైతు చెప్ప‌డం మోష‌న్ పోస్ట‌ర్ ప్రారంభం అవుతుంది. రాజేంద్ర ప్ర‌సాద్ చెప్పే క‌థ‌నం ఓ ఇన్‌టెన్స్‌ను క్రియేట్ చేస్తుంది. జిగ్‌సా పజిల్ ఉండే అంశాల‌న్ని క‌లిసి ఓ వాస్త‌విక రూపానికి వ‌స్తాయి. అలాగే ఈ సిరీస్ కూడా ఉండ‌బోతుంద‌ని మోష‌న్ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు మేక‌ర్స్‌. ఇందులో రాజేంద్ర ప‌సాద్ ముఖంపై క‌న‌ప‌డుతున్న తుపాకీ ఎవ‌రిది.. ఎందుకు చూపిస్తున్నార‌నే ఆస‌క్తిని క‌లిగిస్తుంది. 

సాధార‌ణంగా రాజేంద్ర ప్ర‌సాద్ పేరు చెబితే ఆయ‌న మ‌నల్ని వివిధ పాత్ర‌ల‌తో ఎలా న‌వ్వించారో ఆ పాత్ర‌లే గుర్తుకు వ‌స్తాయి. సేనాప‌తి సిరీస్‌లో మూర్తి అనే సీరియ‌స్ పాత్ర‌లో రాజేంద్ర ప్ర‌సాద్ క‌నిపించ‌నున్నారు. ఆయ‌న‌తో పాటు బ‌ల‌మైన పాత్ర‌ల్లో మంచి ఆర్టిస్టులు స‌హ తారాగ‌ణం న‌టించారు. యూత్, అనుభ‌వం ఉన్న‌వారు కాంబినేష‌న్‌లో రూపొందిన సేనాప‌తి టైట్ స్క్రీన్ ప్లే, ప‌వ‌ర్ ప్యాక్డ్ నెరేష‌న్‌, షార్ప్ పెర్ఫామెన్‌సెస్‌, యూనిక్ ప్లాట్‌తో ఆడియెన్స్‌ను అల‌రించ‌డానికి సిద్ధంగా ఉంది. త్వ‌ర‌లోనే సేనాప‌తి ఆహాలో ప్రేక్ష‌కుల‌ను ముందుకు రానున్నాడో మేక‌ర్స్ తెలియ‌జేస్తారు. 

2021లో ..ల‌వ్‌స్టోరి, అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే, త్రీ రోజెస్‌, వ‌న్‌, మంచిరోజులు వ‌చ్చాయి, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, సర్కార్‌, చెఫ్ మంత్ర‌, ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ, క్రాక్‌, అల్లుడు గారు, 11 అవ‌ర్‌, జాంబిరెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా, నాంది, సూప‌ర్ డీల‌క్స్‌, త‌ర‌గ‌తి గ‌ది దాటి, మ‌హా గ‌ణేష‌, ప‌రిణ‌యం, ఇచ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు వంటి తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు, ఒరిజ‌న‌ల్‌, ప్రోగ్రామ్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తోంది ఆహా.

Aha announces a new original Senapathi:

<span>Aha announces a new original Senapathi, a nailbiting crime drama that marks the OTT debut of Rajendra Prasad</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs