Advertisement
Google Ads BL

ఎవడు చెప్పిండ్రా ఫస్ట్ లిరికల్ సాంగ్


ఇంద్రసేన, సంతోష్ రాజ్, నవీనా రెడ్డి, మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్. సస్పెన్స్ కామెడీ డ్రామా కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు రవి చావలి తెరకెక్కిస్తున్నారు. ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడెమీ పతాకంపై నిర్మాతలు అతీంద్ర అవినాష్ మరియు అలవలపాటి శేఖర్ నిర్మిస్తున్నారు. బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫ్ ర్ చిత్రానికి రాఘవేంద్ర రెడ్డి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు కూడా కంప్లీట్ అయ్యాయి. తాజాగా బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్" సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ ఎవడు చెప్పిండ్రాని నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. మూవీ యూనిట్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ సందర్భంగా 

Advertisement
CJ Advs

దర్శకుడు రవి చావలి మాట్లాడుతూ...బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్ సినిమా పస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేసిన దిల్ రాజు గారికి థాంక్స్. సస్పెన్స్ కామెడీ డ్రామా మూవీగా తెరకెక్కిన మా చిత్రం ప్రతి పది నిమిషాలకు ఒక ట్విస్ట్ ఇస్తూ సాగుతుంది. ఈ థ్రిల్లర్ కథలో ఇమిడిపోయేలా పాటలు ఉంటాయి. బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్ యాక్షన్ తో పాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. త్వరలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

చిత్ర సమర్పకులు రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ....మా బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్" సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు తుది దశకు వచ్చాయి. త్వరలోనే ఫస్ట్ కాపీ చేతికి వస్తుంది. మంచి డేట్ చూసి సినిమాను విడుదల చేస్తాం. మంచి టెక్నికల్ టీమ్ బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్ సినిమాకు పనిచేశారు. సరికొత్త కామెడీ డ్రామా మూవీగా మా సినిమా ఆకట్టుకుంటుంది. అన్నారు

సత్య ప్రకాష్,‌ శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్ - మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ - విజయ్ సి కుమార్, సంగీతం - బాంబే భోలే, పీఆర్వో - జీఎస్కే మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - దుర్గాప్రసాద్ శెట్టి , నిర్మాతలు - అతీంద్ర అవినాష్, శేఖర్ అలవలపాటి సమర్పణ - రాఘవేంద్ర రెడ్డి, దర్శకత్వం - రవి చావలి

Evadu Cheppindra Song in BADMASH GAALLAKU BUMPER OFFER:

Evadu Cheppindra Song in BADMASH GAALLAKU BUMPER OFFER movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs