Advertisement
Google Ads BL

సోహెల్ హీరోగా బూట్ క‌ట్ బాల‌రాజు


బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్‌, అన‌న్య నాగ‌ళ్ల హీరో హీరోయిన్లుగా ల‌క్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం బూట్ క‌ట్ బాల‌రాజు. శ్రీ కోనేటి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఈ రోజు హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. మొద‌టి స‌న్నివేశానికి దిల్‌రాజు క్లాప్ కొట్టగా మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. అనిల్ రావిపూడి గౌర‌వ ద‌ర్శ‌కత్వం వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా..

Advertisement
CJ Advs

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ - లాక్‌డౌన్ టైమ్‌లో రిలీజైన పాగ‌ల్ మూవీని ప్రేక్ష‌కులు బాగా ఆద‌రించారు. థియేట‌ర్‌, ఓటిటి, శాటిలైట్ అన్ని ప్లాట్‌ఫామ్‌ల‌లో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ ఉత్సాహంతోనే మా బ్యాన‌ర్‌లో అల్లూరి సినిమా రూపొందిస్తున్నాం. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే గ‌త ఆరేడు నెల‌లుగా సోహెల్‌తో  ఒక పాయంట్ అనుకుని దాన్ని ఒక క‌థ‌గా మార్చి ఈ రోజు ఓపెనింగ్ జ‌రిపాం. కోనేటి శ్రీ‌ను నా మిత్రుడు చాలా ఏళ్లుగా మేమిద్దరం క‌లిసి ట్రావెల్ చేస్తున్నాం. ఇలాంటి క‌థ సోహెల్ కి క‌రెక్ట్. హుశారు త‌ర్వాత ఆ త‌ర‌హాలో మ‌రో మంచి క‌థ‌లో వ‌స్తున్న‌ సినిమా బూట్‌క‌ట్ బాల‌రాజు. జ‌న‌వ‌రి, పిబ్ర‌వ‌రిలో వ‌రుస‌గా షెడ్యూల్స్ జ‌రిపి సినిమా పూర్తి చేస్తాం. తెలంగాణ క్యారెక్ట‌రైజేష‌న్ కావ‌డంతో తెలుగ‌మ్మాయి కావాల‌ని అన‌న్య‌ని తీసుకున్నాం. నామిత్రుడు భాష గ్లోబ‌ల్ ఫిలింస్‌తో ఈ సినిమాతో అసోసియేట్ అవుతున్నారు అన్నారు.  

సోహెల్ మాట్లాడుతూ - బిగ్‌బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత చేస్తున్న రెండో చిత్ర‌మిది. దాదాపు తొమ్మిది నెల‌లు స్క్రిప్ట్ మీద వ‌ర్క్ చేశాం. మంచి స్క్రిప్ట్ కుదిరింది. డైలాగ్స్ చాలా బాగా వ‌చ్చాయి. బూట్ క‌ట్ బాల‌రాజు అనే క్యారెక్ట‌ర్ డెఫినెట్‌గా మీ అంద‌రిలో ఉండిపోతుంది. అన్ని వ‌ర్గాల వారు త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు. కోనేటి శ్రీ‌ను చాలా ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్‌. దాదాపు తొమ్మిది నెల‌లు స్క్రిప్ట్ మీద వ‌ర్క్ చేశాం అన్నారు.

అన‌న్య నాగ‌ళ్ల మాట్లాడుతూ - మ‌ల్లేశం సినిమా నుండి పెర్‌ఫామెన్స్ ఓరియెంటెట్ క్యారెక్ట‌ర్స్ రావ‌డం మొద‌లైంది. ఈ సినిమాలో కొంచెం బ‌బ్లీగా ఉండే క్యారెక్ట‌ర్. నాకు చాలా ఇష్ట‌మైన పాత్ర‌. మంచి ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌. ల‌క్కీ మీడియాలో సోహెల్‌తో క‌లిసి చేయ‌డం చాలా హ్యాపీ అన్నారు.

ద‌ర్శ‌కుడు శ్రీ కోనేటి మాట్లాడుతూ - ఈ క‌థ ఇంత‌బాగా రావ‌డానికి నా చిన్న‌నాటి మిత్రుడు గోపి కార‌ణం. మేం ఇద్ద‌రం క‌లిసి చాలా రోజుల క్రిత‌మే సినిమా చేయాల్సింది. కాస్త ఆల‌స్య‌మైంది. బూట్‌క‌ట్ బ‌ల‌రాజు  క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. రెండు గంట‌లు హ్యాపీగా న‌వ్వుకునే సినిమా అన్నారు.

Sohel - Ananya Nagalla Boot Cut Balaraju Launched:

<span>Sohel, Ananya Nagalla, Sree Koneti, Lucky Media, Global Films Boot Cut Balaraju Launched</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs