Advertisement
Google Ads BL

శిరీష్, విజయ్, దుల్కర్ సూపర్ స్టైలింగ్..


తెలుగు ఇండస్ట్రీలోనే చాలా మంది స్టైల్ ఐకాన్స్ ఉన్నారు. మన హీరోలు మోడల్స్‌కు ఏ మాత్రం తీసిపోవడం లేదు. ఇంకా చెప్పాలంటే మోడలింగ్‌లో రప్ఫాడిస్తున్నారు. ముఖ్యంగా కుర్ర హీరోలు అయితే స్టైలింగ్ స్టేట్‌మెంట్స్ పాస్ చేస్తున్నారు. అందులో సౌత్ హీరోలే ఎక్కువగా ఉన్నారు. అల్లు శిరీష్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అదిరిపోయే ఫాలోయింగ్‌తో రప్ఫాడిస్తున్నారు. అంతేకాదు వాళ్ల స్టైలింగ్ కూడా వైరల్ అవుతుంది. తాజాగా వెడ్డింగ్ సీజన్ నడుస్తుండటంతో స్టైలింగ్ ఐకాన్స్‌లా మారిపోయారు ఈ ముగ్గురు హీరోలు. తాజాగా బయటికి వచ్చిన వాళ్ల ఫోటోలు చూసి ఫిదా అయిపోతున్నారు అభిమానులు. ఫ్యాన్స్ వాళ్లను చూసి ఫిదా అవ్వడమే కాదు.. అలాగే రెడీ అవ్వాలని కలలు కంటున్నారు.. ఫాలో కూడా అవుతున్నారు. 

Advertisement
CJ Advs

అల్లు శిరీష్: అల్లు శిరీష్ అంతా తెలుపులో మెరిసిపోతున్నాడు. ముఖ్యంగా వైట్ చుడిదార్, దుప్పట్టా కాంబినేషన్‌లో వేసుకున్న వైట్ షర్వానీ పెళ్లికి పర్ఫెక్ట్ మ్యాచ్ అంతే. ఈ స్టైల్‌లో పెళ్ళికి వెళ్తే కచ్చితంగా అక్కడున్న అమ్మాయిలంతా మిమ్మల్నే చూస్తారేమో..? ఈ డ్రెస్‌లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఇంకా డీటైలింగ్ వెళ్తే గోల్డెన్ కప్స్, అలాగే కాలర్స్ కూడా గోల్డ్‌లోనే ఉన్నాయి. బ్రౌన్ కలర్ షూస్‌తో పెళ్లి కొడుకులా మెరిసిపోతున్నాడు శిరీష్. ఈ పెళ్లి లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందిప్పుడు.

దుల్కర్ సల్మాన్: యూత్ స్టైల్ ఐకాన్స్‌లో దుల్కర్ సల్మాన్ కూడా ఉంటాడు. ఈయన వేసుకున్న వైట్ కలర్ చుడిదార్ కాంబినేషన్‌లో ఉన్న మెరూన్ కలర్ షర్వాని అదిరిపోయింది. దానికి గోల్డెన్ బటన్స్ మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఇది కూడా పర్ఫెక్ట్ వెడ్డింగ్ క్యాస్ట్యూమ్. ఈ డ్రెస్‌లో ప్రతీ చిన్న డిటైలింగ్ ఆకట్టుకుంటుంది. నీట్ కర్చీఫ్, గోల్డెన్ బటన్స్, ఐబాల్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. 

విజయ్ దేవరకొండ: విజయ్ దేవరకొండ అంటేనే స్టైల్ ఐకాన్. పైగా ఈయన స్పెషల్ డిజైనర్ వేర్ వేసుకుంటే మాటలుండవు. వైట్ కుర్తా, వైట్ చుడిదార్ కాంబినేషన్‌లో పింక్ షర్వానిలో అదిరిపోతున్నాడు విజయ్ దేవరకొండ. ఇది నిజంగా గేమ్ ఛేంజర్ లుక్‌లా ఉంది. ఇది కచ్చితంగా ఫ్యాషన్ వరల్డ్‌లో సంచలనమే. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఈ లుక్ చూసి ఫిదా అవుతున్నారు. విజయ్‌లా స్టైల్ అప్ అవుతున్నారు. 

Stars Style Statements Are Your Guide To Slay This Wedding Season:

Allu Sirish, Dulquer Salmaan & Vijay Deverakonda Style Statements Are Your Guide To Slay This Wedding Season
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs